రోజుల వ్యవధిలో ప్రాపర్టీలు కొన్న టాలీవుడ్ బడా హీరోలు.. ఎంతకు దక్కించుకున్నారు అంటే?
టాలీవుడ్ బడా స్టార్లు ఇద్దరు రోజుల వ్యవధిలో హైదరాబాద్ లో ప్రాపర్టీలు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ స్టార్లు మరెవరో కాదు మహేష్ బాబు, ప్రభాస్. మరి ఇంతకీ ఈ ఇద్దరూ ఏం కొన్నారు అనే వివరాల్లోకి వెళితే...

వివాదాల్లో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతి సినిమాకు కోట్లాది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ముంబైలో సొంత ఇల్లు సమకూర్చుకోగా హైదరాబాద్ లో కూడా ఒక సొంత ఇల్లు ఉంది. అయితే గతంలో ఒక చోట ఫామ్ హౌస్ కట్టుకోగా అది వివాదాల్లో చిక్కుకుంది.

లిటిగేషన్ లేని ల్యాండ్
ఈ క్రమంలో ఈసారి ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండ్ ఒక దాన్ని కొనుక్కుని హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్ లో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో బడాబాబులకు కేరాఫ్ గా మారుతున్న నానక్‌రామ్‌గూడలో ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలోరూ. 120 కోట్లతో రెండు ఎకరాలు భూమి ఆయన కొన్నాడని తెలుస్తోంది.

ట్రాఫిక్ పెద్దగా వుండని ప్రాంతాన్ని
ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా వుంటుందనీ, ఆయన ఎలాగు నేషనల్ ఫిగర్ అయిపోయాడు కాబట్టి ముంబై లాంటి ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పెద్దగా వుండని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడని అంటున్నారు. ప్రభాస్ అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడని అంటున్నారు.

200 కోట్ల రూపాయలు వెచ్చించి
నానక్‌రామ్‌గూడలో అనేక మంది స్టార్‌లతో సహా బిగ్ షాట్స్ నివసిస్తున్నారు. అదీ కాక ఓఆర్ఆర్ ఎక్కితే కాసేపట్లో రామోజీ ఫిలిం సిటీ సహా, నగరంలో ఎక్కడికైనా చేరుకోవచ్చు. స్థలం కొనేందుకు సుమారు 120 కోట్లు వెచ్చించగా భవన నిర్మాణం కోసం దాదాపు 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.

26 కోట్ల విలువైన ప్లాట్
మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భూమి భారీ పెట్టుబడి పెట్టారు. ఆయన జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన ప్రాంతంలో రూ. 26 కోట్ల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. చెప్పబడిన ప్లాట్ 1, 442 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నత స్థాయి ప్రాంతంలో ఉందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే, ఈ డీల్ నవంబర్ 21, 2021న జరిగిందని, మహేష్ బాబు తాజాగా స్టాంప్ డ్యూటీకి రూ.1.43 కోట్లు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీకి రూ.39 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

ధరలు భారీగా
ఇక ఈ ప్లాట్‌ని యర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు మహేష్ బాబుకు విక్రయించాడు. ఈ ప్రాంతంలో ప్రధానంగా ప్రముఖ వ్యక్తులు మరియు సినీ ప్రముఖులు నివసిస్తున్నందున, ఈ ప్రాంతంలో ధరలు భారీగా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో చదరపు గజం ధర రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలుగా ఉంది.

సినిమాల విషయానికి వస్తే
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ ఏమో రాధే శ్యామ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుండగా వరుస సినిమాలు లైన్ లో


Click it and Unblock the Notifications











