అప్పుడేమో చెలరేగి లిప్‌లాక్స్.. ఇప్పుడేమో ముద్దంటే చేదంటున్న టాలీవుడ్ హీరోయిన్
ఒకప్పుడు పాత సినిమాలలో ముద్దు సీన్లు అనేవి లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ముద్దు సీన్లు అని ప్రేక్షకులకు భ్రమ కల్పించడానికి పువ్వుల వెనక్కి వెళ్లినట్లు చూపించడం సహా అనేక టెక్నిక్ లు వాడుతూ ఉండేవారు. మారుతున్న పరిస్థితుల కొద్దీ లిప్ లాక్ పెట్టకపోయినా పెట్టుకున్నట్లే చూపించే గ్రాఫిక్స్ టెక్నాలజీ వచ్చాయి కానీ కొందరు హీరోయిన్ల సమ్మతితో నిజంగానే మూతి ముద్దులు పెట్టిస్తూ ఉంటారు మన దర్శకులు. అయితే ఆ లిప్ లాక్ సన్నివేశాలతో మంచి పేరు తెచ్చుకున్న ఒక హీరోయిన్ ఇప్పుడు లిప్ లాక్ అంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోందట. వివరాల్లోకి వెళితే

లిప్ లాక్ ట్రెండ్ బాగా పెరిగి
ఇప్పుడు బాలీవుడ్ సహా టాలీవుడ్ లో కూడా లిప్ లాక్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా హీరోహీరోయిన్ల మధ్య ఏదో ఒక సన్నిహిత సన్నివేశం ఏర్పాటు చేసి మరీ లిప్ లాక్ వుండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా దర్శక నిర్మాతలు ఇది బాగా పనికి వస్తుందని భావిస్తున్నారు.

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్
హీరోయిన్లు కూడా ఒక్కోసారి సినిమా హిట్టవుతుందనే నమ్మకంతోనో లేక మొహమాటం కొద్దీ కొన్ని సినిమాలకు లిప్ లాక్ సీన్లు ఉన్నా పర్వాలేదు అనుకుని ముందుకు వెళుతున్నారు. అయితే టాలీవుడ్ లో స్థిర పడాలి అని టాలీవుడ్ వైపు చూసిన ఒక భామ పరిస్థితి ఇప్పుడు ఇరకాటంలో పడిందని తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఒక భామ తొలి సినిమాతోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

మితిమీరిన ముద్దు సన్నివేశాలు
మొదటి సినిమాలోనే హీరోకు రెచ్చిపోయి మరీ ముద్దులు పెట్టేసిన ఈ భామ మొదటి సినిమా ఇచ్చిన ఊపుతో దాదాపు నాలుగైదు సినిమా అవకాశాలు దక్కించుకుంది. అయితే వాటిలో ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఆ భామ చేసిన ఒక సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా ఆ సినిమాలో కూడా మితిమీరిన ముద్దు సన్నివేశాలు ఉన్నాయట.

అవకాశాలు వస్తాయో రావో అని
దర్శకుడు మంచి ఫామ్లో ఉండడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్న సదరు హీరోయిన్ లిప్ లాక్ విషయంలో మాత్రం కాస్త అసౌకర్యంగా ఫీల్ అయిందట. అయినా సరే దర్శకుడు మంచి ఫామ్ లో ఉన్నారు అనే కారణంతో ఎలాగోలా సినిమా పూర్తి చేసింది కానీ తన వద్దకు వచ్చే వారందరూ ఈ లిప్ లాక్ ఉండేలా గానే కథలు సిద్ధం చేసుకుని వస్తున్నారట. ఇలాగే లిప్ లాక్లు ఇస్తూ పోతే భవిష్యత్తులో అవకాశాలు వస్తాయో రావో అని భయంతో ఇకమీదట ముద్దు సన్నివేశాలకు, అతి గ్లామర్ షో కి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుందని టాలీవుడ్ లో టాక్.

జాగ్రత్తలు తీసుకుంటోందట
అందం దాస్తే పెరుగుతుంది అన్నట్టు ఇక మీదట సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షో తగ్గించాలని నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అడపాదడపా సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి హద్దులు దాటి మరీ అందాల ఆరబోతలో బిజీగా ఉండే సదరు హీరోయిన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోందట. మరి ఈ జాగ్రత్తలు ఆమెకు ఏ మేరకు కలిసి వస్తాయి అనేది చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











