Megastar Chiranjeevi కోసం ఏకంగా ఆరు కథలు.. బడా నిర్మాత డ్రీమ్ ప్లాన్?
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో వరుసగా కొత్త ప్రాజెక్టులను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. నేటి యువతరం హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఆయన చాలా వేగంగా ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. అయితే మరి కొంతమంది నిర్మాతలు మెగాస్టార్ తో సినిమా చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా ఒక ప్రముఖ నిర్మాత కూడా ఒక పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.

ఆరు పదుల వయసులో..
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో సరి కొత్తగా రీ ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు అని అర్థమైంది. ఆ తర్వాత ఎంతో ఎనర్జిటిక్ గా చేసిన సైరా నరసింహారెడ్డి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆరుపదుల వయసులో కూడా మెగాస్టార్ యాక్షన్ సన్నివేశాల్లో చాలా ఓపికతో నటించడం అందరినీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆచార్యతో..
అయితే ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించినప్పటికీ సినిమా దర్శకుడు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

నెక్స్ట్ గాడ్ ఫాదర్
ఇక తదుపరి సినిమాలతో ఎలాగైనా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మెగాస్టార్ ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. నెక్స్ట్ అయితే గాడ్ ఫాదర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. లూసిఫర్ సినిమాకు రీమేక్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి స్పందన లభించింది.

రాబోయే సినిమాలు
మెగాస్టార్ బోళా శంకర్ సినిమాతో పాటు వాల్తేరు వీరయ్య అనే మరొక సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే మారుతి దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఈ ప్రాజెక్టుల తో పాటు చర్చల్లో మరికొన్ని కొత్త కథలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Recommended Video


దిల్ రాజు బిగ్ ప్లాన్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి తన అనుకున్న కలను నెరవేర్చుకున్న దిల్ రాజు ఇప్పుడు మెగాస్టార్ ను టార్గెట్ చేశాడు. ఆయన కోసం ప్రత్యేకంగా ఇటీవల ఆరు కథలను కూడా వినిపించినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో రెండు కథలు చాలా అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. మెగాస్టార్ ఆ రెండిటి కథలలో ఏదో ఒకటి ఫైనల్ చేసి పవర్ఫుల్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయమని దిల్ రాజుకి వివరించారట. ఇక దిల్ రాజు తన రైటర్స్ తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మెగాస్టార్ కోసం ఏ డైరెక్టర్ ని ఫిక్స్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











