దేవర మూవీ కోసం ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదా? ముందు అనుకొన్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ సహా పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం "దేవర" అనే చెప్పాలి. గత కొన్ని రోజులు నుచి సోషల్ మీడియా సహా నేషనల్ మీడియాలో కూడా దేవర కోసమే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నో ఏళ్ళు తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వస్తున్నా సినిమా ఇదే కావడం పైగా గ్లోబల్ సక్సెస్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత సినిమా ఇది కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన టీజర్ గ్లింప్స్, పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. దీనితో దేవర ప్రమోషనల్ కంటెంట్ పై భారీ హైప్ నెలకొంది.

tollywood top star skipped devara cleverly but jr ntr booked

ఈ అంచనాలు నడుమ అవైటెడ్ ట్రైలర్ కట్ ని అయితే పాన్ ఇండియా భాషల్లో మేకర్స్ విడుదల చేసాక సీన్ సితార్ అయ్యింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరగడం అటుంచితే మినిమమ్ బజ్ ని జెనరల్ ఆడియెన్స్ లో రేకెత్తించలేకపోయింది అని చెప్పాలి. దీనితో దేవర ఫలితం ఏదో దెబ్బ కొట్టేలానే ఉందని ట్రైలర్ చూసాక చాలా మంది అనుకుంటున్నారు.

అయితే ఇలాంటి డిజప్పాయింటింగ్ రెస్పాన్స్ వస్తుందని ఓ తొలివుడ్ హీరో ముందే ఊహించి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని చెప్పాలి మరి. నిజానికి దేవర అనే సినిమాకి ఎన్టీఆర్ మొదటి ఛాయిస్ కాదు. ఇది అందరికీ తెలియకపోయినా కొంతమందికి బాగా తెలుసు. మరి ఆ స్టార్ హీరో ఎవరో కూడా కాదు ఎన్టీఆర్ కి బాగా సన్నిహితుడు అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జునే..

tollywood top star skipped devara cleverly but jr ntr booked

కాగా అల్లు అర్జున్ తో ఈ సినిమా ఎప్పుడో 2020 లోనే అనౌన్స్ చేశారు. ఒక కాన్సెప్ట్ పోస్టర్ తో కూడా అల్లు అర్జున్ కొరటాల శివతో కొలాబరేట్ అవ్వడం ఆనందంగా ఉందని కూడా తెలిపాడు. పైగా ఇప్పుడు దేవర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారితోనే ఆ సినిమా కూడా అనౌన్స్ అయ్యింది. కానీ ఆ సినిమా నుంచి ఐకాన్ స్టార్ అయితే నైస్ గా అప్పుడు తప్పించుకున్నాడు. మరి ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఎదురొంటున్న నెగిటివిటీ అంతా అల్లు అర్జున్ ఎదుర్కొనేవాడు.

దీనితో అలా బన్నీ తప్పుకున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ బుక్కయ్యిపోయాడు అని చెప్పక తప్పదు. ఒకసారి ఇలా సేఫ్ అయ్యిన బన్నీ మరి దేవర సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి పూర్తిగా సేఫ్ అయ్యాడా లేక ఓ క్రేజీ ఆఫర్ ని వదులుకున్నాడా అనేది తేలిపోతుంది. ఇక ఇపుడు అల్లు అర్జున్ తన కెరీర్ భారీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ లో బిజీగా ఉండగా ఈ చిత్రాన్ని దర్సకుడి దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఈ డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

More from Filmibeat

Read more about: devara allu arjun koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X