స్వలింగ సంపర్కుడిగా తెలుగు హీరో రిస్క్.. ఊహించని స్టోరీ లైన్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పాత్రలతో యువ హీరోలు ఈమధ్య చాలా ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని సక్సెస్ అవుతుంటే మరి కొన్ని మాత్రం డిజాస్టర్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా భిన్నమైన తరహాలోనే సక్సెస్ అందుకోవాలి అని ఓవర్గం హీరోలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అదే తరహాలో గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు కూడా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

ఇక రాబోయే రోజుల్లో ఈ హీరో ఒక గే పాత్రలో కనిపించబొతున్నట్లు టాక్. ఆ వివరాలలోకి వెళితే.. ప్రస్తుతం శ్రీ విష్ణు సామజ వరగమన అనే సినిమా చేస్తున్నాడు లేటెస్ట్ గా అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ హీరో ఎవరు ఊహించని పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Tollywood young actor sree vishnu risky gay role in his upcoming movie

స్వలింగ సంపర్కుడిగా ఒక ప్రయోగాత్మకమైన క్యారెక్టర్ చేయడానికి శ్రీ విష్ణు నటించినున్నట్లు సమాచారం. ఇతర గే పాత్రలలో నటించడానికి చాలా గట్స్ ఉండాలి. కానీ ఈ హీరో మాత్రం డిఫరెంట్ స్టైల్ లో ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా కథలో మంచి ఎమోషన్ ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

అయితే శ్రీ విష్ణు ఏ సినిమాలో ఈ తరహా పాత్రలో నటిస్తున్నాడు ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ త్వరలో మాత్రం ఈ హీరో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. స్వలింగ సంపార్కుడిగా ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఎవరు కూడా పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. ఇప్పుడిప్పుడే కొంతమంది అటువైపు కూడా ప్రయోగాలు చేయాలి అని డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ కంటెంట్ ఎంచుకోవడంలో మాత్రం కాస్త రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా డిజాస్టర్ టాక్ తో పాటు నెగటివ్ టాక్ కూడా అందుకునే అవకాశం ఉంటుంది. మరి శ్రీ విష్ణు ఏ తరహాలో కనిపిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X