పెళ్లై ఆరు నెలలు కాలేదు... అప్పుడే విడాకులకు రెడీ అయిన స్టార్ డైరెక్టర్
ఇటీవల టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లిలు.. ఆ తర్వాత విడాకులు కామన్ అయిపోయేవి. నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత చాలా జంటలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక నిహారిక, చైతన్య జోన్నలగడ్డ ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. సంచలనం సృష్టించారు. ఇప్పుడు తాజాగా మరో జంట వీడిపోతున్నారట. అతను ఓ స్టార్ డైరెక్టర్. ఈ జంట ఎందుకు విడిపోతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినీ పరిశ్రమలో ప్రేమ పెళ్లిల్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత విడాకల వరకు వెళ్లడం ఈ మధ్య కామన్ అయిపోయింది. అప్పట్లో నాగ చైతన్య, సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. వీరు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని.. ఆపై విడిపోయిన సంగతి తెలిసిందే. వీరి విడాకులు ఇప్పటికీ చర్చనీయంశం అవుతునే ఉన్నాయి. అటు నాగ చైతన్య ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.. మరోవైపు సమంత కూడా మయోసైటిస్ తో బాధపడుతూ.. ఉంది.

ఆ విషయం పక్కన బెడితే.. ఈ ఏడాది మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంది. ఎంతో గ్రాండ్ గా నిహారిక జోన్నలగడ్డతో వివాహం చేసుకున్న నిహారిక.. ఆ తర్వాత వీరు విడిపోయారు. ఇక వీరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేశారు. ఇక ఈ విషయం అప్పట్లో చర్చనీయంశం అయింది. ఇక కలర్ స్వాతి విడాకులు తీసుకోబోతుందంటూ వైరల్ గా మారింది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పటికీ క్లారిటీ లేదు.
ఇక ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకుబోతుందంటూ.. వైరల్ గా మారింది. మొదట్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత దర్శకుడిగా మారాడు. ఇక పట్టుమని అరడజన్ సినిమాలు కూడా చెయ్యకపోయినా... తీసిన సినిమాలు హిట్టుగా నిలిచాయి. ఈ ఏడాది కూడా ఓ హీరోతో ఓ సినిమా తీసి.. సూపర్ హిట్టు అందుకున్నాడు. ద్విబాషా చిత్రంగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక ఈ ఏడాది ఆయన లైఫ్ లో చాలా ప్రత్యేకం. సినిమా హిట్టుతో పాటు... అదే నెలలోనే ఆయనకు పెళ్లి అయ్యింది. పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ... వారి మధ్య గొడవలు తలెత్తాయని తెలుస్తోంది. ఇటీవలే ఈ స్టార్ డైరెక్టర్ కు ఓ పెద్ద సినిమా ఓకే అయింది. అంతా సాఫీగా సాగిపోతుందనుకునే లోపే... అతని లైఫ్ లో అనుకోని విషాదం కమ్ముకుందని సమాచారం.
పెళ్లై ఆరు నెలలు కూడా అవ్వక ముందే వారు విడాకులకు అప్లై చేసినట్టు సమాచారం. పెళ్ళైన కొద్ది రోజులకే ఇద్దరికీ 'కంపాటిబిలిటీ ఇష్యూస్' వచ్చి అది విడాకులకు దారి తీసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ ఎంత కాలం పడుతుందో చూడాలి. అది పూర్తయితే తన తరువాతి ప్రాజెక్ట్ మీద పూర్తిగా దృష్టిపెట్టొచ్చు. ఏది ఏమైనా ఇదంతా తొందరగా సమసిపోయి పెద్ద హిట్ కొట్టాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











