యంగ్ హీరోపై మోజు పడుతున్న హీరోయిన్లు.. డేటింగ్‌ అంటేనే దండం పెట్టేస్తున్న కుర్ర హీరో

సినిమా ప్రపంచంలో నటీనటుల మధ్య ఎంత త్వరగా ప్రేమ మొదలవుతుందో అంతే త్వరగా బ్రేకప్ కూడా వస్తుంది. కొంతమంది మాత్రం ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా కూడా ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అయితే ఆ మధ్య కాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా గుర్తింపును అందుకున్న ఒక జంట వీడిపోవడంపై అభిమానుల ఒక్కసారిగా షాక్ అయిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ నుంచి విడిపోయిన తర్వాత ఆ యువ హీరో సోలో లైఫ్ సో బెటర్ అనే విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా కొంతమంది హీరోయిన్స్ అతనితో డేటింగ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరించాడట ఆ వివరాల్లోకి వెళితే..

ప్రేమ నుంచి పెళ్లికి..

ప్రేమ నుంచి పెళ్లికి..

వారసత్వం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఒక కుర్ర హీరో కెరీర్ మొదట్లోనే ఒక హీరోయిన్ తో మంచి స్నేహం ఏర్పర్చుకున్నాడు. కొన్నేళ్ల తరువాత ఆ స్నేహం ప్రేమగా మారింది ఇక పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. దీంతో కూడా వారి జంటను చూసి ఫ్యాన్స్ సైతం ఎంతగానో మురిసిపోయారు. ఇద్దరు కూడా సినీ సెలబ్రిటీలు కావడంతో యధావిధిగా వారికి నచ్చినట్లు గానే ఇండస్ట్రీలో కొనసాగారు.

 ఎంత మాట్లాడినా..

ఎంత మాట్లాడినా..

అయితే యువ హీరోయిన్ తప్పిదం వల్లనో లేక యువహీరో కారణం వల్లనో తెలియదు గాని ఇద్దరూ కూడా విడిపోవడం ఫ్యాన్స్ కు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మళ్లీ కలుస్తారు అనే కథనాలు వెలువడినప్పటికి కూడా ఇద్దరు కలవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అని తెలిసింది. కుటుంబ సభ్యులు కూడా చాలాసార్లు మాట్లాడినప్పటికీ కూడా హీరో హీరోయిన్ మళ్లీ దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదు. ఇక వారికి నచ్చిన విధంగానే విడాకులు తీసుకుని విడిపోయారు.

సినిమాలతో బిజీగా..

సినిమాలతో బిజీగా..

విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఆ ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళు చాలా హ్యాపీగా కొనసాగిస్తున్నారు. పెద్దగా బాధ లేకుండా వారి కెరీర్ యధావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం యువ హీరో తనకు నచ్చిన విధంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుండగా ఆ హీరోయిన్ కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది.

హీరోయిన్స్ ఆరాటం..

హీరోయిన్స్ ఆరాటం..

అయితే హీరోయిన్ నుంచి హీరో విడిపోయిన అనంతరం అతనిపై కొంతమంది హీరోయిన్స్ కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. అతనితో డేటింగ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారట. ఒక హీరోయిన్ అయితే అతని కోసం ఎన్నోసార్లు మాట్లాడినట్లు కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపించింది. హీరో మాత్రం పెద్దగా క్లోజ్ గా వెళ్లకుండా కేవలం ఒక స్నేహభావంతోనే ఆమెతో ఉన్నట్లు సమాచారం

దండం పెట్టేస్తున్నాడు

దండం పెట్టేస్తున్నాడు

ఒకరు అని కాదు చాలామంది హీరోయిన్స్ కూడా హీరో కోసం డేటింగ్ చేయాలని గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. హ్యాండ్సమ్ లుక్స్ అలాగే మంచి బ్యాక్ గ్రౌండ్ హీరోగా మంచి మార్కెట్ ఉండటంతో హీరోయిన్స్ అతన్ని విధాలుగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మంది ఎన్ని రకాలుగా చెబుతున్నా కూడా ఆ హీరో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదట. వీలైనంత వరకు అమ్మాయిలకు దూరంగా ఉంటూ.. డేటింగ్ అంటేనే దండం పెట్టేస్తున్నాడు.. ఫైనల్ గా సోలో లైఫ్ సో బెటర్ అంటూ ఓ వర్గం వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X