For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ హీరో.. అభిమానులకు షాకిస్తూ సంచలన నిర్ణయం?

  |

  ఒకప్పుడు సెలబ్రిటీల పర్సనల్ విషయాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ జంటలు విడిపోతున్న దాఖలాలు పెరిగిపోతుండడంతో ఎప్పుడు ఎవరు విడాకులు తీసుకుంటారు? ఎప్పుడు ఎవరు బ్రేకప్ చెప్పుకుంటారు? అనేది తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజా సమాచారం మేరకు టాలీవుడ్ లో మరో జంట విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే

  దక్షిణాది భాషల్లో కూడా

  దక్షిణాది భాషల్లో కూడా

  ఒకప్పుడు బాలీవుడ్ లో ప్రేమ వివాహాలు చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. అలాగే విడాకులు కూడా ఎక్కువగానే జరుగుతూ వచ్చేవి. బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ పరంపర కొంచెం తక్కువే.

  అయితే ఇప్పుడు టాలీవుడ్ సహా ఇతర దక్షిణాది భాషల్లో కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలలో విడాకుల వ్యవహారం అనేది చాలా ఈజీ అయిపోయింది. సమంత నాగచైతన్య విడాకులు మొదలు ధనుష్- సౌందర్య విడాకులు ఈ కోవలోకే వస్తాయి.

  ఊహించని విధంగా నిజాలు

  ఊహించని విధంగా నిజాలు

  అయితే ముందు పుకార్లుగా మొదలవుతున్న ఈ వార్తలు ఎవరూ ఊహించని విధంగా నిజాలు అవుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందాన ఈ పుకార్లను కూడా ఇపుడు నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె కూడా విడాకులు తీసుకుంటుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

  అందుకు ఊతం ఇవ్వడానికే అన్నట్టు వారిద్దరి సోషల్ మీడియా అకౌంట్లలో కూడా సూచనలు కనిపిస్తూ ఉండటంతో సాధారణ ప్రజలు కూడా నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  విడాకుల దిశగా ప్రయత్నాలు

  విడాకుల దిశగా ప్రయత్నాలు

  ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువ హీరో విడాకుల దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో తాను ప్రేమించిన అమ్మాయిని చాలా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న ఒక యువ హీరో కాపురంలో ఇప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయి అని తెలుస్తోంది. పెళ్లయిన ఏడాదిలోపే తాము ఇద్దరం కలిసి ఉండలేము అనే నిర్ణయానికి ఇద్దరు వచ్చారు అని ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

   సెట్ అవ్వదు అనే

  సెట్ అవ్వదు అనే

  ప్రస్తుతానికి చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సదరు కుర్ర హీరో ఏడాది పాటు కాపురం చేసిన తర్వాత తన భార్యకు తనకు సెట్ కాదు అనే విషయం అర్థం చేసుకున్నాడు.. అయితే విడాకుల గురించి ముందు ఆలోచించలేదు కానీ కలిసి ఉండేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇక తామిద్దరి మధ్య సెట్ అవ్వదు అనే విషయం అర్థమైంది.

  విడిపోయి హ్యాపీగా ఉండటం

  విడిపోయి హ్యాపీగా ఉండటం

  వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అని తెలిసి ఇద్దరి కుటుంబాలకు సంబంధించిన పెద్దలు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు కానీ ఆ గొడవలు ఎంతకీ తగ్గకపోవడం ఇక ఇరు కుటుంబాలకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదట. రోజు గొడవ పడుతూ కలిసి ఉండటం కంటే విడిపోయి హ్యాపీగా ఉండటం నయం అని భావిస్తున్న ఈ జంట విడాకులకు సిద్ధమయ్యాడని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.

  అధికారికంగా ప్రకటన

  అధికారికంగా ప్రకటన

  ఇప్పటికే లీగల్ గా ముందుకు వెళ్లిన ఈ జంట అది పూర్తయిన తర్వాత దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.. భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా సదరు కుర్ర హీరో చేతినిండా సినిమాలు ఉన్న వాటిపై దృష్టి పెట్టలేకపోతున్నారట. మరి అది ఎప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారు అనేది తెలియాల్సి ఉంది.

  English summary
  As per filmnagar gossips another tollywood hero heading towards divorce.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X