30లో ఉన్న హీరోల ఇంట్లో గోల మొదలైంది.. పెళ్లికి సిద్ధమవుతున్న మరో ఇద్దరు హీరోలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరోనా కారణంతో సైలెంట్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో లేక వయసు పెరిగిపోతోంది అనుకుంటున్నారో తెలియదు గాని, మొత్తానికి ఒక నిర్ణయంతో పెళ్లికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా 30ఏళ్ళ వయసులో ఉన్న హీరోలు ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Recommended Video

Rana Daggunati Tied Knot With Miheeka Bajaj ఇంట్లో నుంచే పెళ్లిని చూసేలా దగ్గుబాటి ఏర్పాట్లు !
 మరో కొత్త బ్యాచ్ కూడా..

మరో కొత్త బ్యాచ్ కూడా..


ఇటీవల రానా దగ్గుబాటి, నితిన్, నిఖిల్... మొత్తానికి వారికి ఇష్టమైన వారిని సింపుల్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళంటనే మొన్నటివరకు ఆమడ దూరం పరిగెత్తిన ఈ హీరోలు ఇప్పుడు కూల్ గా పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చరపరిచింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ పెళ్లికి మరో కొత్త బ్యాచ్ కూడా రెడీ అవుతోంది.

మెగా ఫ్యామిలీలో ఆ ముగ్గురు

మెగా ఫ్యామిలీలో ఆ ముగ్గురు

మెగా ఫ్యామిలీలోనే 30లోకి వచ్చిన హీరోలు ముగ్గురున్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇటీవల మూడు పదుల వయసులోకి వచ్చేశారు. ఇక వారికంటే రెండేళ్లు పెద్దవాడైన సాయి ధరమ్ తేజ్ మొత్తనికి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజే ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఇంట్లో నిహారిక నిశ్చితార్థ వేడుకతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇక సాయి పెళ్లికి కూడా ముహూర్తం సెట్టయితే మరిన్ని సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతాయి.

శర్వానంద్ కూడా.

శర్వానంద్ కూడా.

కరోనా వైరస్ లోనే ఎలాంటి హడావుడి లేకుండా కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవచ్చని మరికొందరు హీరోలు కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే శర్వానంద్ కూడా ఒక ఇంటివాడు కాబోతున్నట్లు టాక్ వస్తోంది. వారి దగ్గరి బంధువుల అమ్మాయిననే శర్వా వివాహం చేసుకోనున్నాడట.

 రామ్ తప్పించుకుంటాడా?

రామ్ తప్పించుకుంటాడా?


మరో హీరో రామ్ ఇంట్లో కూడా అప్పుడే పెళ్లికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. రామ్ వయసు 32 ఏళ్ళు. మూడు పదుల వయసులోకి వచ్చినప్పటి నుంచే ఈ హీరోను పెళ్లి చేసుకోమ్మని ఇంట్లో వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారట. కానీ రామ్ మూడేళ్ళుగా కెరీర్ కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నాడు. మరి ఈ సారి తప్పించుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X