Devara: తెలుగు హీరో సర్‌ప్రైజింగ్ రోల్.. ఎన్టీఆర్ మూవీలో ట్విస్ట్ అదే
విజయాల పరంపరతో కెరీర్‌లో గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కు అతడు ఎదిగిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తారక్.. తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి చేస్తోన్నాడు. 'దేవర' అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని రూపొందిస్తోన్నారు.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను అంగరంగ వైభవంగా మొదలు పెట్టడంతో పాటు రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను విజయవంతంగానే పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో దాన్ని కూడా జరుపుతున్నారు. ఇలా వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలతో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీలో పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మరో తెలుగు యువ హీరో కూడా నటిస్తున్నాడట. అతడి పాత్ర సినిమాను మలుపు తిప్పేదిగా ఉంటుందని తెలిసింది. ఈ హీరో పాత్రతోనే సినిమాలోని ఓ బిగ్ ట్విస్ట్ వస్తుందట. అందుకే అతగాడి పేరును బయటకు రానీయకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. దీంతో ఇప్పుడీ రోల్‌పై అందరిలో ఆసక్తి పెరుగుతోంది.
కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











