నవంబర్ లో పెళ్లికి చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. అతనే అంటూ ప్రచారం
టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో చాలా కాలంగా కొంతమంది యువ హీరోల పెళ్లిళ్ల గురించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో కొనసాగుతున్న హీరోలు త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా రెగ్యులర్ గా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా మరొక హీరో కూడా నవంబర్లో పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లుగా మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. అతను మరెవరో కాదు.. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అని అంటున్నారు.. ఆ వివరాలలోకి వెళితే..

ప్రభాస్ పెళ్లిపై..
ప్రస్తుతం పెళ్లికి సిద్ధం కావాల్సిన తెలుగు బ్యాచిలర్ హీరోలు సంఖ్య ఎక్కువగానే ఉంది. సీనియర్ హీరోలలో అయితే ప్రభాస్ పెళ్లి పై ఇప్పటికీ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకునే ఆలోచనలో లేడు అని మరొక టాక్ కూడా వచ్చింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.

మెగా ఫ్యామిలీలో..
ఇక మెగా ఫ్యామిలీలో కూడా మరొక నలుగురు హీరోలు పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ అలాగే అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా మూడు పదుల వయసులకి వచ్చేశారు. ఇక మరొక హీరో వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవాల్సి ఉంది. గతంలోనే అతని పెళ్లి జరగబోతున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. నాగబాబు కూడా అప్పట్లో నిహారిక పెళ్లి తరువాత తొందరగానే అతని పెళ్లి కూడా జరుగుతుంది అని అన్నారు. కానీ ఇంతవరకు మళ్లీ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

వరుణ్ తేజ్ పేరు వైరల్
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో త్వరలోనే ఒక యంగ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అనేక రకాల కథనాలు వెలబడుతున్నాయి.. అతను మరెవరో కాదు మెగా హీరో వరుణ్ తేజ్ అని కూడా చెబుతున్నారు. వరుణ్ తేజ్ కోసం ప్రత్యేకంగా నాగబాబు తనకు తెలిసిన సన్నిహితుల కుటుంబ సభ్యులలోని ఒక అమ్మాయిని చూసినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. కానీ ఇంకా ఆ విషయంలో ఎవరూ కూడా స్పందించింది లేదు.

క్లారిటీ ఇచ్చిన హీరో
ఏదేమైనప్పటికి కూడా నవంబర్లో మాత్రం ఒక టాలీవుడ్ హీరో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో బలమైన టాక్ అయితే వినిపిస్తోంది. ఇక గతంలో రామ్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత అందులో ఎలాంటి నిజం లేదు అని రామ్ ఆ వార్తలను కొట్టి పారేసిన విషయం తెలిసిందే. ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను అని తన ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే ఉన్నట్లుగా కూడా రామ్ తెలియజేశాడు.

నాగబాబు నిర్ణయం
ఇక మరోవైపు వరుణ్ తేజ్ పేరు మాత్రం సోషల్ మీడియాలో కొన్ని గంటల నుంచి ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. నాగబాబు అయితే తన కొడుకు పెళ్లి ని వీలైనంత తొందరగానే చేయాలని అనుకుంటున్నాడట. సరైన సమయంలో అల్లు అర్జున్ తరహాలో పెళ్లి పెళ్లి చేసుకుంటే బెటర్ అనే సలహాలు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు అధికారికంగా క్లారిటీ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











