టాలీవుడ్లో మరో విడాకుల బాంబు..... నిన్న క్రిష్, ఇపుడు అతడి హీరో కూడా!

By Bojja Kumar

Recommended Video

Tollywood Young Hero Follows Krish Incident

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడాకుల వ్యవహారం గురించిన షాక్ నుండి ఇండస్ట్రీ జనాలు ఇంకా తేరుకోక ముందే మరో డైవోర్స్ కేసు హాట్ టాపిక్ అయింది. ప్రముఖ తెలుగు సినీ ఫ్యామిలీకి చెందిన యువ హీరో కూడా ఇదే బాటలో నడుస్తున్నాడని, త్వరలోనే అతడు విడాకులు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీకి చెందిన బడా సినీ ఫ్యామిలీకి చెందిన స్టార్ కావడంతో ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 క్రిష్ మూవీలో నటించిన ఆ హీరో

క్రిష్ మూవీలో నటించిన ఆ హీరో

దర్శకుడు క్రిష్‌కు మంచి పేరు తెచ్చిన మల్టీస్టారర్ మూవీలో ఈ యంగ్ హీరో ఒక కథానాయకుడిగా నటించాడు. ఇతగాడి తండ్రి ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఆయన్ను చెప్పుకుంటారు. ముక్కుసూటిగా ఉండే ఆయనంటే ఇండస్ట్రీలో చాలా మందికి గౌరవం.

భార్య భర్తల మధ్య మనస్పర్ధలు

భార్య భర్తల మధ్య మనస్పర్ధలు

మూడేళ్ల క్రితం ఈ యంగ్ హీరో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాల నుండి ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే సంవత్సరం తర్వాత భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని సమాచారం. ఇద్దరి కలిపేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా, కౌన్సిలింగ్ ఇచ్చినా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.

 వరుస పరాజయాలు

వరుస పరాజయాలు

ప్రస్తుతం ఈ హీరో హైదరాబాద్‌లోనే ఉంటుండగా.... ఆవిడ యూఎస్ఏ వెళ్లి తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం. హీరోగా కెరీర్ విషయానికొస్తే చాలా కాలంగా ఇతగాడికి సరైన హిట్స్ లేవు, సినిమాలు చేయడం కూడా చాలా తగ్గించేశాడు.

 అందుకే ఎవరూ మాట్లాడటం లేదా?

అందుకే ఎవరూ మాట్లాడటం లేదా?

సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరో తండ్రి అంటే ఇండస్ట్రీలో చాలా మందికి గౌరవం. దీంతో ఈ విషయం గురించి మాట్లాడటానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. అఫీషియల్ సమాచారం లేదు కాబట్టి మేము కూడా అతడి పేరు బయట పెట్టలేని పరిస్థితి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X