తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ స్టార్ హీరో.. ఆనందంలో మునిగితేలుతున్న ఫ్యాన్స్

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి అందరికీ తెలిసిందే. విభిన్నమైన కథలతో వచ్చి ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే ఈ కుర్ర హీరో మూడేళ్ల క్రితం తన ప్రేయసి పల్లవి వర్మనే పెళ్లి చేసుకున్న విషయం అందిరకీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ పుల్ బిజీగా గడుపుతున్నారు ఈ యంగ్ హీరో. హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. ఇటీవలే కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత 18 పేజెస్, స్పై సినిమాల్లో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు.

ఓవైపు కెరియర్ లో ఫుల్ జోష్ గా ముందుకు వెళ్తున్న ఈయన పర్సనల్ లైఫ్ ను కూడా చాలా చక్కగా మెయింటేన్ చేసుకుంటూ వస్తున్నారు. 2020లో పల్లవి వర్మతో పెళ్లి జరగ్గా.. వీరిద్దరిపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ విడిపోతున్నారని, నిఖిల్ కుటుంబ సభ్యులతో పల్లవి పొసగలేకపోతుందంటూ చాలానే ఫైక్ న్యూస్ వైరల్ అయింది. కానీ ఎప్పటికప్పుడు నిఖిల్ వాటిని కొట్టిపరేస్తూ.. తన పర్సనల్ లైఫ్ గురించి వెల్లడించారు. అయితే తాజాగా ఈయన గురించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Tollywood Young Hero Nikhi Siddhartha Became Father Check Details Here

అదేంటంటే... నిఖిల్ సిద్దార్థ తాజాగా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం. నిఖిల్ సిద్దార్థ, పల్లవి వర్మలు తల్లిదండ్రులు కాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పెళ్లి జరిగి ఇప్పటికే మూడేళ్ల పూర్తి కావడంతో పాటు వారు కూడా తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకోవాలని భావించారట. ఈక్రమంలోనే పిల్లల కోసం ప్లాన్ చేసుకోగా.. పల్లవి గర్భం దాల్చిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఈ యంగ్ హీరో స్పందించలేదు. అలాగే పల్లవి వర్మ కూడా తన గర్భం గురించి ఎక్కడా నోరు విప్పలేదు.

Tollywood Young Hero Nikhi Siddhartha Became Father Check Details Here

భార్యాభర్తల్లో ఎవరో ఒకరు లేదా.. వారి ఫ్యామిలీ మెంబర్స్ స్పందిస్తే తప్ప అసలు విషయం తెలిసేలా లేదు. ఈ వార్తలు చూస్తున్న నిఖిల్ అభిమానులు అయితే ఈ వార్తలు నిజం అయితే బాగుండు అని ఫీలవుతున్నారు. తమ అభిమాన హీరో భర్త నుంచి తండ్రిగా ప్రమోషన్ కొట్టేస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. ఆయన తండ్రి కాబోతున్నట్లు చెప్పి అందిరికీ గుడ్ న్యూస్ చెబుతారా లేక ఇదంతా అబద్ధమని చెప్పి అందరినీ షాక్ గురిచేస్తారా.

Tollywood Young Hero Nikhi Siddhartha Became Father Check Details Here

ఇదిలా ఉండగా.. నిఖిల్ సిద్దార్థ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభూ అనే చిత్రంలో నటిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు భువన్, శ్రీకర్ కలిసి నిర్మిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ సినిమాలో నిఖిల్ హీరోగా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X