యాంకర్ సుమ, ఝాన్సీ రహస్య మీటింగ్.. టాలీవుడ్‌లో మొదలైన మూవ్‌మెంట్!

Recommended Video

Anchor Suma & Jhansi Meets Secretly

బాలీవుడ్, తమిళ చిత్ర పరిశ్రమల్ని మీటూ ఉద్యమం కుదిపేస్తోంది. టాలీవుడ్ లో కూడా అలాంటి ఉద్యమం మొదలయిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది మహిళా సినీప్రముఖులు ఇటీవల రహస్యంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీరు చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రహస్య భేటీలో యాంకర్ సుమ, ఝాన్సీ వంటి ప్రముఖులు ప్రధాన పాత్ర పోషించినట్లు వార్తలు వస్తున్నాయి.

 ప్యానల్ ఏర్పాటు చేయాలని

ప్యానల్ ఏర్పాటు చేయాలని

మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు, ఫిర్యాదులు అందుకునేందుకు ఓ ప్యానల్ ఏర్పాటు చేయాలని ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఏ ప్యానల్ ద్వారా మహిళా ఆర్టిస్టులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులని కూడా ధైర్యంగా ప్రస్తావించే వాతావరణాన్ని కల్పించడానికి పలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

సుమ, ఝాన్సీ ఇంకా ఎవరంటే

సుమ, ఝాన్సీ ఇంకా ఎవరంటే

ఈ భేటీలో యాంకర్ సుమ, ఝాన్సీ, మహిళా దర్శకురాలు నందిని రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరికొందరు ప్రముఖ నటీమణులు కూడా భేటీలో పాల్గొన్నారట. వీళ్లంతా మా అసోసియేషన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 బలపడుతున్న మీటూ ఉద్యమం

బలపడుతున్న మీటూ ఉద్యమం

బాలీవుడ్, తమిళ చిత్ర పరిశ్రమల్లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. పలువురు దర్శకులు, నటులపై లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో మీటూ ఉద్యమాన్ని తనుశ్రీ దత్త ప్రారంభించింది. దిగ్గజ నటుడు నానా పాటేకర్ పై తనుశ్రీ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగి మీటూ ఉద్యమం ప్రారంభమైంది.

ముందు జాగ్రత్తగా

ముందు జాగ్రత్తగా

తమిళ చిత్ర పరిశ్రమలో కూడా సింగర్ చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో రాకుండా ముందుగానే మహిళా ఆర్టిస్టుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నాల్లో టాలీవుడ్ మహిళా సినీప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.

సమంత మద్దత్తు

సమంత మద్దత్తు

మీటూ ఉద్యమానికి టాలీవుడ్ నటీమణులు సమంత, కాజల్ ఇప్పటికే మద్దత్తు ప్రకటించారు. చాలా రోజుల క్రితమే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటంలో మహిళా ఆర్టిస్టుల భద్రత విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X