»   »  రచ్చ రచ్చ: స్టార్ హీరోయిన్‌తో టాప్ డైరెక్టర్ ఎఫైర్, ఎవరు?

రచ్చ రచ్చ: స్టార్ హీరోయిన్‌తో టాప్ డైరెక్టర్ ఎఫైర్, ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్‌కి సంబంధించిన స్టార్ హీరోస్, టాప్ డైరెక్టర్లలో కొందరికి... ప్లేబాయ్స్ అనే ట్యాగ్ ప్రచారంలో ఉంది. కొందరైతే తరచూ హీరోయిన్లతో ఎఫైర్లు నడుపుతూ వార్తలో ఉంటూ ఉంటారు. వీరిపై ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే అనే ప్రచారం కూడా ఉంది.

తాజాగా ఓ విషయం హాట్ టాపిక్ అయింది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లు కొట్టిన ఓ దర్శకుడు తన సినిమాలో నటించిన హీరోయిన్‌పై ఎక్స్ ట్రా ఇంట్రెస్ట్ పెట్టినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి ఒకే ఫైస్టార్ హోటల్ కు వెళ్లడం, ఒకే గదిలో గడపడం లాంటివి చేస్తున్నారట.

 Top Director's Affair With Star Heroine

దర్శకుడికి హైదరాబాద్ లో మంచి ఇల్లు...ఆయన్ని ఎంతోగానే ప్రేమించే భార్య, పిల్లలు ఉన్నారు. తన లేడీ లవ్‌తో గడపడానికే అతను ఇలా తరచూ స్టార్ హోటల్స్ కు వెలుతుంటాడనే గాసిప్స్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఈ విషయం దర్శకుడికి భార్యకు తెలిసి చాలా ఇరిటేట్ అయినట్లు సమాచారం.

అయితే దర్శకుడికి సన్నిహితులు విషయం రచ్చరచ్చ కుండా ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ముఖ్యంగా మీడియాకు తెలిస్తే సీన్ సితార్ అవుతుందని, ఇప్పటికే మీపై గాసిప్స్ వినిపిస్తున్నాయని హెచ్చరించినట్లు సమాచారం. విషయంతో తెలియడంతో దర్శకుడికి, అతని భార్యకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని, పరిస్థితి విషయమిస్తే విడాకులు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా చర్చించుకుంటున్నారు.

అయితే సదరు హీరోయిన్ మాత్రం ఈ గొడవలకు దూరంగా, అసలు తనకేమీ సంబంధం లేనట్లుగా ఇతర సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోందట. ఇంతకీ ఏ దర్శకుడు, ఆ హీరోయిన్ ఎవరంటారు??

English summary
More than star heroes, top directors have become the playboys in the Telugu industry of late. Their affairs and illicit relations have been providing good food for gossip columns.
Please Wait while comments are loading...