Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
భారీ చిత్రాల దర్శకుడితో చిరంజీవి.. క్రేజీ ప్రాజెక్ట్‌కు అల్లు అరవింద్ సన్నాహకాలు!
Recommended Video
ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు. తన ప్రతి చిత్రాన్ని శంకర్ భారీతనంతో తెరకెక్కిస్తారు. ఒకరకంగా భారీ చిత్రం అంటే ఏంటో ఇండియన్ సినిమాకు పరిచయం చేసింది శంకరే. అపరిచితుడు, భారతీయుడు, రోబో లాంటి ఎన్నో అద్భుత చిత్రాలని శంకర్ తెరకెక్కించారు. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో శంకర్ ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవితో
మెగాస్టార్ చిరంజీవితో క్రేజీ డైరెక్టర్ శంకర్ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇది నిజమే అంటూ టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. భారతీయుడు 2 పూర్తయిన తర్వాత శంకర్ చిరంజీవి చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో
చిరంజీవితో తెరకెక్కించే చిత్రానికి సంబధించి ఇటీవల అల్లు అరవింద్, శంకర్ మధ్య ప్రాధమిక చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో చిరంజీవితో తెరకెక్కించే అదే కథని తమిళంలో అజిత్ లేదా విజయ్ తో తెరకెక్కించేలా వీరి మధ్య ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అలా రెండు భాషల్లోనూ సరిపడే మంచి కథని సిద్ధం చేయాలని అల్లు అరవింద్ శంకర్ ని కోరారట.
వరుసగా స్టార్ డైరెక్టర్స్‌తో
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చిరు తన కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం పూర్తి కాగానే కొరటాల శివ దర్శకత్వంలోని చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈలోపు శంకర్ భారతీయుడు 2 పూర్తి చేయనున్నాడు. గతంలో పలు సందర్భాల్లో శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉన్నట్లు చిరంజీవి తెలిపారు.
సందేశాత్మక చిత్రాలతో
శంకర్ తన ప్రతి చిత్రంలో మంచి సందేశాన్ని జోడిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ శంకర్ సినిమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక చిరు కోసం శంకర్ ఎలాంటి కథ సిద్ధం చేస్తాడో వేచి చూడాలి. ప్రస్తుతం చిరంజీవి సైరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.