twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్‌తో అఫైర్.. భార్యకు విడాకులు ఇవ్వబోతున్న టాప్ డైరెక్టర్!

    |

    సినీ పరిశ్రమలో అఫైర్లు, రిలేషన్‌షిప్స్, పెళ్లి, విడాకులకు సంబంధించిన విషయాలు మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత టాలీవుడ్‌లో కూడా డైవోర్స్‌కు సంబంధించిన విషయాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఇలాంటి ఊహగానాల మధ్య ఓ ప్రముఖ డైరెక్టర్‌ తన దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నారనే విషయం జాతీయ మీడియాలోను హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు భార్య నుంచి విడాకులు తీసుకొంటున్నారనే విషయంలోకి వెళితే..

    దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు

    దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు

    దక్షిణాదికి చెందిన దర్శకుడు ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో తన సత్తాను చాటుతున్నారు. షారుక్, అక్షయ్ కుమార్ లాంటి అగ్రహీరోలతో సినిమాలు రూపొందించి బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించారు. యాక్షన్, కామెడీ చిత్రాలతో మంచి ఎంటర్‌టైనర్‌మెంట్ చిత్రాలను అందించారు. టాప్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నారు.

    100 కోట్ల క్లబ్‌లో టాప్ డైరెక్టర్‌గా

    100 కోట్ల క్లబ్‌లో టాప్ డైరెక్టర్‌గా

    ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన డైరెక్టర్‌గా ఘనతను సొంతం చేసుకొన్నారు. తాను రూపొందించిన చిత్రాల్లో ఎక్కువ సినిమాలను 100 కోట్ల క్లబ్‌లో చేర్చారు. తన కెరీర్‌లో ఎక్కువ చిత్రాలు 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించాడు. కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

     బుల్లితెరపై హోస్ట్‌గా పాపులర్

    బుల్లితెరపై హోస్ట్‌గా పాపులర్

    ఇక కేవలం హిందీ చిత్రసీమకే పరిమితం కాలేదు. టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా హోస్ట్‌గా పలు రియాలిటీ షోలను రూపొందిస్తున్నారు. బుల్లితెరపై షోలను రూపొందిస్తూ అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకొంటున్నాడు. అలాంటి ప్రతిభావంతుడు ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చిక్కుల్లో పడ్డారు.

     హీరోయిన్‌తో చాటుమాటు వ్యవహారం

    హీరోయిన్‌తో చాటుమాటు వ్యవహారం

    ఇండియాలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకొన్న దర్శకుడు కొంతకాలంగా టాప్ హీరోయిన్‌తో అఫైర్‌ను కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరూ చాటుమాటుగా కలుసుకోవడం భార్యకు తెలియడంతో దాంపత్య జీవితంలో కలతలు నెలకొన్నాయి. ప్రియురాలికి చేరువైన ఆ దర్శకుడు ఇప్పుడు భార్యకు ముఖం చాటేస్తున్నాడనేది తాజా సమాచారం.

    15 ఏల్ల దాంపత్య జీవితానికి ముగింపు

    15 ఏల్ల దాంపత్య జీవితానికి ముగింపు

    ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్‌కు, ఆయన భార్య తమ జీవితంలో నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపించలేని స్థితికి చేరుకొన్నారు. వారి మధ్య సయోధ్యను కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో వారిద్దరూ 15 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నారు అని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే విడాకుల విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

    English summary
    Bollywood's Top film directors affair with heroine is hot topic in the industry. Now, Its leads to divorce with wife. They are going to put pul stop to 15 years family life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X