ఎన్టీఆర్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసి,మెచ్చేసుకున్నాడట

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్,దేవి కాంబినేషన్ లో వచ్చిన ఐటం సాంగ్స్ అన్నీ సూపర్ హిట్స్. 'అ అంటే అమలాపురం', 'ముప్పీ ఆరు.. ఇరవై ఆరు..', 'రింగ రింగ', 'డియాలో డియాలో', 'లండన్‌ బాబు..' ఇలా పాటలన్నీ అదరగొట్టిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. ఇప్పుడు అలాంటి సాంగ్ ఒకటి ఎన్టీఆర్ చిత్రం కోసం దేవి రెడీ చేసారని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రీసెంట్ గా ఎన్టీఆర్ ఆ పాట విని,నచ్చేసి దేవిని తెగ మెచ్చుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సారి ఐటం సాంగ్ కూడా పెద్ద హిట్టవతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ ఐటం సాంగ్ లో నటించేందుకు ఓ హీరోయిన్ ని వెతుకుతున్నారు.రాశిఖన్నా కానీ తమన్నా కానీ ఆ పాటలో నర్తించబోయేది అని వినపడుతోంది. మరి వీరిద్దరిలో ఎవరైనా ఆ కిక్ ఇచ్చే ఐటం సాంగ్ లో చేస్తే ఇక చెప్పుకునేది ఏముంది...ఎన్టీఆర్ ఫ్యా్న్స్ కు పండుగే.

ఆ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌, రాజేంద్రప్రసాద్‌ మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' అనే పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ ఐటెమ్‌ సాంగ్ లో మెరిసే హీరోయిన్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

అలాగే.. ఈ చిత్రం కొన్ని కొత్త విషయాలు బయిటకు వచ్చాయి. ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం. ఇవి ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న విషయాలు మాత్రమే.

Top heroines to paly cameo in Sukumar NTR's Movie Item Song

టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి...

ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ జరిగింది. ఆ ఎనౌన్స్ మెంట్ చేసింది మరెవరో కాదు ఎన్టీఆర్ తో గతంలో బృందావనం, రామయ్య వస్తావయ్యా చిత్రాలు నిర్మించిన దిల్ రాజు. దిల్ రాజు రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ తో చిత్రం ఎనౌన్స్ చేసారు.

ఆ చిత్రం దర్శకుడు మరెవరో కాదు..అందరూ ఊరించినట్లుగానే కొరటాల శివ. ప్రస్తుతం మహేష్ తో శ్రీమంతుడు తో బిజిగా ఉన్న కొరటాల శివ తన తదుపరి చిత్రానికి ఎన్టీఆర్ ని ఒప్పించుకున్నారు. గంతంలోనే మిర్చి తర్వాత ఎన్టీఆర్ తో చెయ్యాల్సి ఉంది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు కుదిరింది. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా మీడియాకు తెలియచేసారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి 2016 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X