Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
RRR కోసం హాలీవుడ్ బిగ్ స్టూడియో.. రాజమౌళి ప్లాన్స్ మామూలుగా లేవుగా..
టాలీవుడ్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి అనంతరం దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాపై నార్త్ ఇండస్ట్రీలో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. దాదాపు అన్ని భాషల వాళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.
అయితే ప్రమోషన్ విషయంలో దర్శకుడు రాజమౌళి ఆలోచనా విధానం కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. సినిమాను ఇంగ్లీషులో కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఒక హాలీవుడ్ స్టూడియోతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
అంచనాలకు తగ్గట్టుగానే RRR
రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని ఇప్పటికే హీరోల పవర్ఫుల్ టీజర్స్ తో ఒక క్లారిటీ ఇచ్చేశారు. సినిమాకు సంబంధించిన మొదటి పాట కూడా ఆ అంచనాలను మరింత పెంచేసింది. సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించాడు.
ఇంగ్లీష్ లో కూడా భారీగా
మొత్తంగా అన్ని వైపుల నుంచి సినిమాకు భారీ స్థాయిలో అయితే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాను తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు హాలీవుడ్ లో కూడా అదే తరహాలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇంగ్లీష్ లో సినిమాను విడుదల చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు కానీ నిర్మాత డివివి దానయ్య దర్శకుడు రాజమౌళి ఇప్పటికే కొన్ని ప్రణాళిక నిర్వహించినట్లు సమాచారం.
రంగంలోకి వార్నర్ బ్రదర్స్
హాలీవుడ్ ఇండస్ట్రీలో వేల కోట్లతో సినిమాలను తెరకెక్కించే వార్నర్ బ్రదర్స్ త్రిబుల్ ఆర్ సినిమాను ఇంగ్లీష్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం యూనిట్ సభ్యులతో ఈ బడా స్టూడియో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. తప్పకుండా సినిమా అన్ని భాషల్లోనూ వర్కౌట్ అవుతుందని దర్శకుడు నమ్మకంతో ఉన్నారు. రాజమౌళి స్థాయి ఏమిటో కూడా తెలుసు కాబట్టి వార్నర్ బ్రదర్స్ RRR సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Recommended Video
దుబాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
అయితే ఇంతవరకు కూడా సినిమాను ఇంగ్లీష్ లో విడుదల చేస్తున్న విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చర్చలు జరుపుతున్నారు కాబట్టి అవి సక్సెస్ అయితేనే క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. RRR సినిమాకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర నిర్మాత డివివి దానయ్య రాజమౌళి తనయుడు కార్తికేయ ఇద్దరు కూడా దుబాయ్ కి వెళ్లి ఈవెంట్ కు సంబంధించిన ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మరి RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంత వరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.