Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
RRR డీలింగ్స్ మామూలుగా లేవు.. కర్ణాటక రైట్స్ కోసం రంగంలోకి టాప్ ప్రొడ్యూసర్స్!
బిగెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న RRR పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల కర్ణాటకకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ పై కూడా ఒక డీల్ సెట్టయినట్లు సమాచారం. ఏకంగా ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ సినిమా హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా ఆకట్టుకొనున్నాడు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఈజీగా 500కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.
డీలింగ్స్ క్లోజ్ అయినట్లే..
దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను డివివి.దానయ్య ప్రొడక్షన్ లో దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అవసరం అయితే మరికొంత బడ్జెట్ కూడా పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీలింగ్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యాయి.
కర్ణాటక రైట్స్ వాళ్ళకే..
ఇక ఇటీవల కర్ణాటకకు సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం. రాజమౌళికి అత్యంత సన్నిహితంగా ఉండే సాయి కొర్రపాటికి ఆ రాష్ట్ర RRR హక్కులు దక్కినట్లు సమాచారం. అయితే 50 నుంచి 60కోట్ల మధ్యలో ధర పలుకగా మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. ఆ తరువాత మరొక నిర్మాత పాట్నర్ గా రావడంతో కర్ణాటక రైట్స్ దక్కించుకున్నారు.
రాజమౌళి కారణంగా..
ఆ నిర్మాత మరెవరో కాదు. ఏషియన్ అధినేత సునీల్ సునీల్ నరాంగ్. సాయి కొర్రపాటితో పాట్నర్ గా ఉంటూ RRRను కర్నాటకలో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారట. సినిమా హక్కుల కోసం KGF నిర్మాతలు కూడా బాగానే ప్రయత్నాలు చేసినట్లు టాక్ వచ్చింది. కానీ సాయి కొర్రపాటి మొదటి నుంచి కూడా రాజమౌళికి క్లోజ్ కావడంతో ఆయనకే దక్కినట్లు టాక్.