SSMB 29: రాజమౌళి మహేష్ సినిమాపై టాప్ సీక్రెట్స్.. ఈ స్థాయిలో అంటే బాక్సాఫీస్ బీభత్సమే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో తన 29వ సినిమాని పాన్ వరల్డ్ లెవల్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఆగష్టు, సెప్టెంబర్ లో ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జక్కన్న స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట.

ఇదిలా ఉంటే ఈ కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి సంబంధించి టాప్ 7 ఇంటరెస్టింగ్ గాసిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లార్డ్ హనుమాన్ ఇనిస్పిరేషన్ తో ఈ మూవీలో మహేష్ బాబు పాత్రని హైపర్ యాక్టివ్ గా డిజైన్ చేసారంట. అలాగే వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు ఈ మూవీలో కనిపిస్తాడు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది.

Top secret gossips on SSMB 29 movie latest updates viral

ఇక ఈ మూవీలో మహేష్ బాబు పిజికల్ అపీరియన్స్ కూడా కాస్తా డిఫరెంట్ గా ఉండబోతుందంట. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకి భిన్నమైన లుక్ లో ఈ మూవీలో కనిపిస్తాడంట. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ జెన్నా ఒర్టేగ మహేష్ బాబుకి జోడీగా కనిపిస్తుందని మరో టాక్. ఇప్పటికే రాజమౌళి ఆమెతో సంప్రదింపులు జరిపారట.

ఈ సినిమాకి హాలీవుడ్ లో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్ ని రాజమౌళి స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అయితే జక్కన్న తన స్టైల్ లో అడాప్ట్ చేసుకొని మహేష్ బాబు క్యారెక్టర్ ని హ్యూమర్ టచ్ తో పాటు సాహసాలు చేసే వాడిగా చూపించబోతున్నారంట. దాదాపు కథను మూడు భాగాలుగా విభజించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ మూవీ కోసం ఏకంగా 500 కోట్ల బడ్జెట్ ని ని రాజమౌళి ఖర్చు చేయబోతున్నారంట. ఇప్పటికే దానికి సంబందించిన బడ్జెట్ ప్లాన్ నిర్మాత కెఎల్ నారాయణకి జక్కన్న ఇవ్వడం జరిగిందని టాక్. అలాగే ఈ మూవీని ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుననరంట. దానికి తగ్గట్లుగానే విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే కూడా ఈ మూవీలో ఒక హీరోయిన్ గా కనిపించబోతుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X