మహేశ్ బాబు కోసం పోటీ..ముగ్గురు టాప్ డైరెక్టర్ల మధ్య వార్..వాళ్లెవరంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు రేంజ్ త్వరలో వరల్డ్ మార్కెట్ ను చేరుకోబోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో మహేశ్ బాబు సినిమా చేస్తుండటంతో బాబు రేంజ్ గ్లోబల్ వైడ్ గా మారిపోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి ప్రచారం ఉంది. అయితే జక్కన్నతో సినిమా తర్వాత మహేశ్ బాబు ఎవరికి దర్శకత్వ అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ముగ్గురు టాప్ డైరెక్టర్లు మహేశ్ బాబు గురించి ఇప్పుడు పోటీ పడుతున్నారని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టి ప్రచారం జరుగుతోంది.

SSMB29 మూవీ వివరాలు..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్ట మొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూ.1000 కోట్ల బడ్జెట్ తో SSMB29ని రూపొందిస్తున్నారు. కేఎల్ నారాయణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తుండటం విశేషం. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Top Three Director are Waiting for Mahesh Babu Who will get a chance is interesting

SSMB29 షూటింగ్ వివరాలు..
రాజమౌళి మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా ఎప్పుడూ సెట్ అవ్వుద్దా అని ఫ్యాన్స్, ఆడియెన్స్ తో పాటు ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేసింది. ఎట్టకేళలకు ఈ ఏడాది SSMB29 షూటింగ్ కూడా ప్రారంభమై రెండు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకోవడం విశేషంగా మారింది. రీసెంట్ గా ఇటలీలో షెడ్యూల్ ను ఫినిష్ చేసుకొని టీమ్ మొత్తం రెస్ట్ మోడ్ లో ఉందని తెలుస్తోంది. సమ్మర్ ముగిశాక మళ్లీ తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారని టాక్. నెక్ట్స్ షెడ్యూ ల్ లో మహేశ్ బాబుతో జక్కన్న సముద్రంలో బోట్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్, కర్ణాటక, ఓడిశా వంటి రాష్ట్రాల్లో షూటింగ్ జరిపారు.

వెయింటింగ్లో ముగ్గురు టాప్ డైరెక్టర్లు..
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తర్వాత మహేశ్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మహేశ్ బాబు కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు వెయింట్ లో ఉన్నారని తెలుస్తోంది. వారెవరో కాదు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు అని తెలుస్తోంది. వీరి ముగ్గురితో మహేశ్ బాబు సినిమాకు ఓకే చెప్పినట్టు ప్రచారం.

నెక్ట్స్ ఛాన్స్ ఎవరికీ..
అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లు ప్రస్తుతం భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కల్కి2తో నాగ్ అశ్విన్, స్పిరిట్ తో సందీప్ రెడ్డి వంగ, పెద్ది చిత్రంతో బుచ్చిబాబు ఇండియాను షేక్ చేయబోతున్నారనే అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే వీరిలో మొదటగా బుచ్చిబాబుతో లేదంటే సందీప్ రెడ్డి వంగతో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు వారి రాబోయే చిత్రాల ఫలితాలపై మళ్లీ తుది నిర్ణయాలు ఉంటాయని కూడా ప్రచారం. వీటిపై ఎలాంటి అధికారిక ప్రటకన లేదు. మున్ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.

More from Filmibeat

Read more about: mahesh babu ssmb29 ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X