NTR30: ఎన్టీఆర్ సినిమాకు కొత్త సమస్య.. ఆయన ఎంట్రీతో మొత్తం మారిందట
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేసుకుంటూ వస్తున్నాడు. దీంతో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా పెంచుకుంటున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో తారక్ వరుసగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.
హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఈ మధ్యనే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను కూడా క్రియేట్ చేసుకుంది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమా అసలు ఉంటుందా? ఉండదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. దీని తర్వాత వస్తున్న ప్రాజెక్టుపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక, ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, ఈ సినిమా మాత్రం అస్సలు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే దీని నుంచి గ్లిమ్స్ వీడియోను వదిలారు. దీంతో ఈ సినిమా ఎప్పటికైన ప్రారంభం అవుతుందని పరోక్షంగా చెప్పనట్లైంది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచే ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా స్క్రిప్టులో మరోసారి మార్పులు చేస్తున్నారట. ఇందుకోసం తారక్ కోరిక మేరకు టాలీవుడ్‌లోనే ఓ టాప్ రైటర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ స్క్రిప్టును పూర్తిగా మార్చి రాస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఈ సినిమా ప్రారంభం ఆలస్యం అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక, ఇది మరికొన్ని రోజుల్లోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ వెంటనే సినిమా షూట్ మొదలవుతుందని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబోలో భారీ బడ్జెట్‌తో రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశం మొత్తాన్ని మార్చేలా ఇచ్చే సందేశంతో ఇది రూపొందుతోందట. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











