For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa Leaks: మొత్తం 30 నిమిషాలకు చేరుకున్న లీక్స్.. మరీ ఇంత దారుణామా..?

  |

  గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అలవైకుంఠపురములో సినిమాతో లాస్ట్ ఇయర్ తన కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కసారిగా హీరోగా ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. టాలీవుడ్ లో భారీ ప్రొడక్షన్ సంస్థలు గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా కి థమన్ అందించిన సాంగ్స్ ఎంతో పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచి యూట్యూబ్ లో సరికొత్త సెన్సేషన్ సృష్టించాయి. దానితో హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇక దాని తరువాత ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ తీస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీ లో అల్లు అర్జున్, పుష్పరాజ్ అనే పాత్ర లో కనిపించనుండగా రష్మిక కూడా పక్కాగా మాస్ రోల్ లోనే కనిపించనుంది.

  సాంగ్ తో మరింత హైప్

  సాంగ్ తో మరింత హైప్

  దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి క్యూబా బ్రోజెక్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. మొదట ఈ సినిమాని ఒక్క భాగంగా తీద్దాం అనుకున్నప్పటికే కథని మరింతగా విస్తరించే అవకాశం ఉండడంతో ఫైనల్ గా రెండు పార్ట్స్ గా తీయాలని యూనిట్ నిర్ణయించింది. ఇక ప్రస్తుతం పుష్ప ది రైజ్ (పార్ట్ 1) షూటింగ్ ఆల్ మోస్ట్ చాలా వరకు పూర్తి కాగా, వీలైనంత త్వరలో మిగిలిన షూట్ ని కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు యూనిట్ సభ్యులు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరి నుండి మంచి స్పందన అందుకోవడంతో పాటు కొద్దిరోజుల క్రితం ఐదు భాషల్లో విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ శ్రోతలను మరింత విశేషంగా ఆకట్టుకుంటోంది.

  మొత్తం 30 నిమిషాల లీకులు

  మొత్తం 30 నిమిషాల లీకులు

  అయితే ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించి లీకుల బెడద యూనిట్ అందరిలోను తీవ్ర స్థాయిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుండి ఒక లిరికల్ సాంగ్ తో పాటు మరొక వీడియో సాంగ్, అలానే ఒక భారీ ఫైట్ సీన్ వంటివి లీకుల బారిన పడ్డాయి. ఇక కొన్ని లొకేషన్స్ కి సంబంధించి పలు సీన్స్ కూడా బయటకు వచ్చాయి. మొత్తంగా ఇదంతా కలిపితే పుష్ప కి సంబంధించి 30 నిమిషాల వరకు ఫ్యూటేజ్ లీక్ అయినట్లు చెప్తున్నారు.

  కేసు నమోదు చేసే లోపే మరో లీక్

  కేసు నమోదు చేసే లోపే మరో లీక్


  మరోవైపు తాము సూపర్ స్టార్ మహేష్ తో తీస్తున్న మరొక సినిమా సర్కారు వారు పాట బ్లాస్టర్ టీజర్ కూడా ఈ విధంగా లీక్ కావడంతో ఈ రెండు సినిమాల నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు సైబర్ క్రైమ్ లో నిందితులని పట్టుకోవాలని కేసు ఫైల్ చేసారు. అయితే వారు కేసు ఫైల్ చేసిన తరువాత కూడా పుష్ప నుండి మరొక లీక్ రావడం షాకింగ్ విషయం అనే చెప్పాలి.

  సినిమా మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారా?

  సినిమా మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారా?

  మరి ఇప్పటికైనా మైత్రి నిర్మాతలు మరింత కఠినంగా వ్యవహరించి ఈ లీకుల బెడద నుండి తమ సినిమాలను రక్షించుకుంటారా లేక అవి రిలీజ్ అయ్యేలోపు మొత్తం సినిమాని లీక్స్ రాయుళ్ల ద్వారా లీక్ చేయించుకుంటారా అంటూ కొందరు ఆడియన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయమై మైత్రి నిర్మాతలు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలి. నిజంగా ఈ విధంగా లీక్స్ చేయడం ఎంతో దారుణం అని, వేలాదిమంది టీమ్, కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంతో శ్రమతో సినిమాలు తీస్తుంటే ఇలా లీక్స్ పేరిట వాటిని దొంగిలించడం దారుణం అని, ఇకనైనా ప్రభుత్వాలు ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని పలు సినిమా వర్గాలు కోరుతున్నాయి. కాగా పుష్ప పార్ట్ 1 సినిమా క్రిస్మస్ పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

  English summary
  Total pushpa leaks footage shocking run time,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X