టాక్సిక్ అవుట్.. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌‌పై ట్విస్ట్? పవన్ మూవీపై అనూహ్య నిర్ణయం!

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన మూవీ టాక్సిక్. ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఈ మూవీ అనూహ్యంగా వాయిదాపడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. మార్చి 19న టాక్సిక్ విడుదల కావాల్సా ఉంది. అయితే ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దాంతో సినిమాను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

టాక్సిక్ ఎగ్జిట్‌తో ధురంధర్ 2కి ఊపు
టాక్సిక్ బరిలో నుంచి తప్పుకోవడంతో మార్చి 19 నాడు రిలీజ్ అవుతున్న రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్‌ 2కు ఎదురులేకుండా పోయింది. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం తప్పదని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అయితే టాక్సిక్ ఎగ్జిట్‌తో ధురంధర్‌ 2 మార్చి 19న థియేటర్లపై విరుచుపడనుంది. టాక్సిక్, ధురంధర్ 2 పోరుతో తాము నష్టపోతామని అనేక చిన్నా పెద్దా సినిమాలు పండుగ సీజన్‌ను వదులుకున్నాయి. ఇప్పుడు టాక్సిక్ నిష్క్రమణతో ఆ ప్లేస్‌ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి.

Toxic Postponed Will Ustaad Bhagat Singh eye on March 19th Release to Clash with Dhurandhar 2

మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్
ఈ లిస్ట్‌లో వినిపిస్తోన్న తొలి పేరు ఉస్తాద్ భగత్ సింగ్. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ కొద్ది నెలల గ్యాప్‌లో వస్తుండటంతో ఈ అంచనాలను మరింత పెంచేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

ఉస్తాద్ టీమ్‌లోకి థమన్
కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ గతంలో నటించిన తేరీకి రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్‌ను తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. అయితే వీటిని హరీశ్ శంకర్ ఖండించారు. రిలీజ్‌కు మరో 20 రోజులే ఉండటంతో ఫస్ట్ కాపీ రెడీ చేయించి సెన్సార్ పనులు, ఇతర పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను పరుగులు పెట్టించాలని హరీశ్ భావిస్తున్నారు. అలాగే ఉస్తాద్‌కు భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్‌కు 20 రోజుల ముందు ఈ సినిమాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంగీత దర్శకుడిగా ఉన్న దేవిశ్రీప్రాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారట. దేవిని పాటలకు పరిమితం చేసి.. ఉస్తాద్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను థమన్‌కు అప్పగించినట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మార్చి 19పై ఉస్తాద్ కన్ను?
మరోవైపు.. మార్చి 19న టాక్సిక్ వాయిదా పడటంతో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి సీజన్‌లను క్యాష్ చేసుకోవాలని ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ భావిస్తోంది. దాంతో ముందుగా అనుకున్నట్లుగా మార్చి 26న కాకుండా వారం ముందుకు జరిగి 19వ తేదీన టాక్సిక్ ప్లేస్‌లో బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ నుంచి రణ్‌వీర్ సింగ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఓవర్సీస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ దెబ్బకు ధురంధర్ 2కు తిప్పలు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి నిజంగానే మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందా? లేక ముందు షెడ్యూల్ చేసిన మార్చి 26నే ఖాయం చేసుకుంటుందా? అనేది త్వరలోనే తెలియనుంది.

More from Filmibeat

Read more about: toxic ustaad bhagat singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X