Toxic: టాక్సిక్ కోసం దిల్‌రాజ్ స్ట్రాటజీ.. యష్ మూవీ కోసం అలాంటి స్కెచ్?
రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం టాక్సిక్. శాండల్‌వుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటించిన చిత్రం కావడంతో టాక్సిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై హైప్ మరింత పెంచాయి. ఇక టాక్సిక్ మూవీ.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు కూడా ప్రతిష్టాత్మకం. ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ఆయన భారీ ధరకు దక్కించుకున్నారు. దాంతో ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావడంతో పాటు ప్రాఫిట్ జోన్‌లోకి తీసుకొచ్చేందుకు దిల్‌రాజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
టాక్సిక్ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇందులో యష్ సరసన ఐదుగురు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. వీరితో పాటు అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

గతంలో యష్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన గ్లింప్స్‌తో పాటు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌లతో సినిమాపై హైప్ తారాస్థాయికి చేరుకుంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, ఇంటిమేట్ సీన్స్, వయలెన్స్.. మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. దాంతో మార్చి 19న థియేటర్స్‌లో యష్ విధ్వంసం ఓ రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు. సరిగ్గా అదే రోజు రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ మూవీ ధురంధర్ 2 కూడా రిలీజ్ కానుండటంతో రెండు సినిమాలలో ఏది పైచేయి సాధిస్తుందోనని డిస్కషన్ నడుస్తోంది.
కాగా.. సినిమాపై హైప్ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇటీవల టాక్సిక్ ఓవర్సీస్ రైట్స్‌ను 105 కోట్ల రూపాయలకు పార్స్ ఫిలింస్ దక్కించుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రూ. 120 కోట్లకు కైవసం చేసుకున్నారు. మొత్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
అన్నింటిలోకి దిల్‌రాజు చేసిన రిస్క్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్దినెలలుగా దిల్‌రాజు సంస్థకు డిస్ట్రిబ్యూషన్, నిర్మాణపరంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్రాండ్ నేమ్‌ను నిలబెట్టేందుకు దిల్‌రాజు సాహసం చేస్తున్నారు. ఏకంగా 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టాక్సిక్ తెలుగు రైట్స్ కొనడం ఆషామాషీ విషయం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలతో పాటు ఆయన జడ్జిమెంట్, బ్రాండ్ ఇమేజ్‌పైనా అసాధారణమైన దెబ్బ పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న దిల్‌రాజుకు ఈ విషయం తెలియంది కాదు.. అయినప్పటికీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే సూత్రాన్ని పెద్దాయన ఫాలో అవుతున్నారు. టాక్సిక్‌ను తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ జోన్‌గా మార్చేలా దిల్‌రాజు పావులు కదుపుతున్నారు.
దీనిలో భాగంగా భారీ ఎత్తున టాక్సిక్ ప్రమోషనల్ కార్యక్రమాలకు దిల్‌రాజు ప్లాన్ చేసినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. టాక్సిక్ రిలీజ్‌కు కొద్దిరోజుల ముందు హైదరాబాద్‌లో ఓ మెగా ఈవెంట్ నిర్వహించాలని రాజుగారి ప్లాన్. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్‌లుగా రంగంలోకి దించాలని భావిస్తున్నారట. తద్వారా టాక్సిక్‌పై హైప్ పెంచి ప్రేక్షకులను థియేటర్ వైపు నడిపించాలని యోచిస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











