Toxic: టాక్సిక్‌ రిలీజ్‌కు మరో బ్రేక్? యశ్ నిర్ణయమే కారణమా?

కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తోన్న భారీ యాక్షన్‌ మూవీ టాక్సిక్. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ ఓసారి వాయిదా వేశారు. మార్చిలో రావాల్సిన ఈ చిత్రం జూన్‌కు పోస్ట్‌పోన్ అయింది. అయితే.. తాజాగా యష్ టాక్సిక్ మూవీ మరోసారి వాయిదా పడబోతుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నుంచి వస్తున్న తొలి ఫుల్ లెంగ్త్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ ఒకసారి మారగా, ఇప్పుడు మళ్లీ విడుదల వాయిదా పడే అవకాశముందని వినిపిస్తోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

భారీ యాక్షన్‌ మూవీకి గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే దర్శకురాలిగా పేరున్న గీతూ మోహన్ దాస్, యశ్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సినిమా నుంచి విడుదల అయినా పస్ట్ క్లింప్స్, ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. సాధారణ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఆసక్తి ఉంది. మొదట ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో రిలీజ్‌ను జూన్ 4కు వాయిదా వేశారు.

Toxic Release Delay Buzz Yash Film OTT Deal Issues May Push Date Again Rumors Spread

అయితే.. తాజాగా వినిపిస్తున్న రూమార్స్ ప్రకారం.. జూన్ 4 తేదీ కూడా దాదాపు కష్టమేనని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ ఇంకా పూర్తిగా ముగియకపోవడం, కొన్ని కీలక సన్నివేశాలు మిగిలి ఉండటం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. టీజర్‌లో యశ్ స్టైలిష్ లుక్, డార్క్ టోన్, యాక్షన్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని బోల్డ్ సన్నివేశాలపై విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ టీజర్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది.

ఇప్పుడు సినిమా ఆలస్యానికి మరో పెద్ద కారణంగా ఓటీటీ డీల్ వివాదం వినిపిస్తోంది. సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.250 కోట్ల భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారట. కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థలు రూ.110 కోట్లకు మించి ఇవ్వడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ డిమాండ్, ఆఫర్ మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో డీల్ ఇంకా కుదరలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పెద్ద బడ్జెట్ సినిమాలకు ఓటీటీ రైట్స్ ముఖ్యమైన ఆదాయ వనరుగా మారిన ఈ కాలంలో, ఈ ఒప్పందం ఆలస్యం కావడం మేకర్స్‌కు తలనొప్పిగా మారిందని అంటున్నారు. మరోవైపు ఈ డీల్ ఆలస్యానికి యశ్ నిర్ణయం కూడా కారణమని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాల విషయంలో ఓటీటీ సంస్థలకు ప్రివ్యూ చూపించి, కంటెంట్‌పై నమ్మకం కలిగించి డీల్ క్లోజ్ చేస్తారు. అయితే ఈ విషయంలో యశ్ మాత్రం 'థియేటర్ ఫస్ట్' విధానాన్ని పాటిస్తున్నారట. సినిమా అనుభవం మొదట పెద్ద తెరపైనే రావాలని, ముందే ప్రివ్యూ చూపిస్తే ఆసక్తి తగ్గిపోతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయం వల్ల ఓటీటీ సంస్థలు పూర్తి సినిమా చూడకుండా భారీ మొత్తాలు పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే డిజిటల్ రైట్స్ ఒప్పందం ఇంకా నిలిచిపోయిందని చెబుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. మేకర్స్ నుంచి గానీ, యశ్ టీమ్ నుంచి గానీ వాయిదాపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జూన్ రిలీజ్ కష్టమేనని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు బడ్జెట్ కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం.

అందుకే థియేట్రికల్ బిజినెస్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ హక్కులు అన్నీ కలిసి రికవరీ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఓటీటీ ఒప్పందం ఆలస్యమైతే, విడుదల తేదీపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. యశ్ అభిమానులు మాత్రం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత ఆయన ఏ కథను ఎంచుకుంటారు? ఎలా కనిపిస్తారు? అనే ఆసక్తి కొనసాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే... టాక్సిక్ ఫైనల్ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారన్నదానిపైనే ఉంది.

Read more about: yash geetu mohandas toxic
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X