మీ శత్రువులందరూ నాశనం అయిపోవాలి: రామ్ గోపాల్ వర్మ
వివాదాస్సద వ్యాఖ్యలు, వివాదాస్పద సినిమాలతో ఎప్పుడు వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. నిజం చేదుగా వుంటుంది. రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ డైజెస్ట్ చేసుకొవడం చాలా కష్టం. మొన్నామద్యన రాముడు భార్య కోసమే రావణుడితో యుద్ధం చేసాడు కానీ ప్రజలకు కోసం కాదు కదా మరి రాముడు దేవుడు ఎలా అవుతాడని ప్రశ్నించాడు.
శ్రీరామ నవమి నాడు అందరూ రాముడిని పూలతో కొలుస్తుంటే మన రామ్ గోపాల్ వర్మ నిందలతో శంకించాడు. అదే విధంగా భార్య కోరిక మేరకు రామున్ని అడవులకి పంపిన దశరధుడు స్వర్గానికి ఎలా వెళతాడని అడిగాడు. లక్ష్మణుడి భార్య ఊర్మిళ సీత లాగా అడవులకు వెల్లనందున ఆమె కూడా నరకానికి వెలుతుందా అని వర్మ తన ట్విటర్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇలా రాముడి గురించి ఇష్టమొచ్చిన పిచ్చిప్రేలాపనలు చేసిన రామ్ గోపాల్ వర్మ దీపావళికి పండుగకు కరెక్ట్ ట్వీట్ వేసారాయన. దీపావళి సందర్భంగా మీ శత్రువులందరూ నాశనం అయిపొయాలి అని కోరుకునే ముందు, మీరు కూడా ఎవరికైనా శత్రువేమో తెలుసుకొండి. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. అంటూ అభిమానులను ఆశ్చర్య పరిచాడు.
కాగా నాగచైతన్య, అమలాపాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'బెజవాడ. వివేక్ కృష్ణ దర్శకుడు. రామ్‌గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు నిర్మాతలు. చిత్రీకరణ పూర్త య్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరు కున్నాయి.


Click it and Unblock the Notifications











