ఎంతో ఊరించి ఉసురుమనిపించిన సరిలేరు టీమ్.. ‘బ్లేడ్’కు కత్తెర వేయనున్నారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి బరిలోకి దిగి బాక్సాఫీస్‌పై దాడి చేస్తూ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇప్పటికే వంద కోట్ల షేర్‌ను రాబట్టడమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాలని మూవీ యూనిట్ ఆలోచిస్తోందని టాక్.

మొదటి నుంచి హైప్..
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి ట్రెయిన్ ఎపిసోడ్, బండ్ల గణేష్ కామెడీ సీన్స్ అదిరిపోతాయని ఊదరగొట్టారు. సినిమా విడుదలయ్యే ఒక్క రోజు ముందు వరకు అదే మాట చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ స్టేజ్ మీదకు ఎక్కిన బండ్ల గణేష్, అనిల్ రావిపూడి ఇలా ప్రతీ ఒక్కరూ ట్రెయిన్ ఎపిసోడ్ గురించి చెబుతూ ఆకాశానికెత్తేశారు.

ఉసురుమనిపించారు..
అయితే సినిమా విడుదలయ్యాక సీన్ రివర్స్ అయింది. ట్రెయిన్ ఎపిసోడ్ అంటూ చెప్పుకొస్తే వెంకీ సినిమా రేంజ్‌లో ఉంటుందని అంతా భావించారు. తీరా చూస్తే దాని దరిదాపుల్లో కూడా లేదనే టాక్ వచ్చింది. అందులోనూ వారి చేసే అతికి ప్రేక్షకులు నెత్తి పట్టుకున్నారు.

పేలని బండ్ల గణేష్ పాత్ర..
ఇక ఎన్నో అంచనాలు పెంచుతూ వచ్చిన బండ్ల గణేష్ ఎపిసోడ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. పొలిటికల్ వేడిలో బండ్ల గణేష్.. సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.. అది మైండ్‌లో పెట్టుకునే బండ్ల గణేష్‌కు ఆ వేషం, ఆ పేరు పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఎపిసోడ్స్‌కు కత్తెరపడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

కత్తెర వేయాలనే ఆలోచనలో..
సినిమాకు సక్సెస్ టాక్ వచ్చి, రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నా.. కొన్ని సన్నివేశాల విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావటంపై చిత్రయూనిట్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ట్రెయిన్ ఎపిసోడ్‌లో కొంత భాగాన్ని ట్రిమ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బండ్ల గణేష్ సన్నివేశాలను వరకు తొలగించాలని అనుకుంటున్నట్లు టాక్. సోమవారం నుంచి ఈ సీన్లు ఉండవని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలు నిజమో కాదో చూడాలి.


Click it and Unblock the Notifications











