నాని డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ కొత్త సినిమా!
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బిజీ హీరోగా మారిపోయాడు. వరుణ్ ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో స్పేస్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ఎఫ్ 2 చిత్రం కూడా ప్రారంభమైంది.
ఇదిలా ఉండగా మరో దర్శకుడికి వరుణ్ ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నేను లోకల్ చిత్రంలో నానికి హిట్ అందించిన త్రినాధ్ నక్కినతో వరుణ్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కమర్షియల్ యాంగిల్ ఉన్న ప్రేమ కథా చిత్రాలని త్రినాథ్ అందంగా తెరకెక్కించగలరు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు నిర్మించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఫిదా, తొలి ప్రేమ వంటి వరుస విజయాల తరువాత వరుణ్ తేజ్ దర్శకులకు క్రేజీ హీరోగా మారిపోయాడు.


Click it and Unblock the Notifications











