అల్లు అర్జున్‌తో త్రిప్తి డిమ్రి: ఎందుకు? ఎలా? కలుస్తున్నారో తెలిస్తే!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలానే పాన్ ఇండియా రేంజ్ మూవీలు తెరకెక్కుతోన్నాయి. అయితే, అందులో కొన్నింటిపై మాత్రమే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టి పడింది. అలాంటి సినిమాల్లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' ఒకటి. ఈ సినిమాపై క్రమంగా అంచనాలను పెంచుకుంటూ దూసుకుపోతూనే ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' మూవీ సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్'కు తీస్తున్నారు. పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి.. సిండికేట్‌ బిజినెస్‌ను ఎలా రూల్ చేశాడన్న స్టోరీలైన్‌తో ఈ చిత్రం రాబోతోంది. దీంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి విపరీతంగా పెరిగింది.

Tripti Dimri Guest Role in Pushpa The Rule Movie

పెరుగుతున్న హైప్‌కు అనుగుణంగానే తెరకెక్కుతోన్న 'పుష్ప ది రూల్'కు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రారంభించింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా ముగించి.. ఎలాగైనా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ యాక్షన్ జోనర్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప 2' కోసం పాన్ ఇండియా సెన్సేషన్, యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి‌ను సెలెక్ట్ చేశారని తెలిసింది.

Tripti Dimri Guest Role in Pushpa The Rule Movie

'పుష్ప ది రూల్' మూవీలో ఓ స్పెషల్ రోల్ కోసం ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నారట. ఇలా ఇప్పుడు త్రిప్తి డిమ్రి‌ను ఫైనల్ చేశారని తెలిసింది. ఇందులో ఆమె కనిపించేది కాసేపే అయినా యానిమల్‌కు మించిన ప్రభావాన్ని చూపించబోతుందని అంటున్నారు. ముఖ్యంగా బన్నీతో వచ్చే కాంబినేషన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయని సమాచారం. త్రిప్తి అతి త్వరలోనే 'పుష్ప' షూట్‌లో జాయిన్ అవుతుందని టాక్.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతోన్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X