Triptii Dimri: త్రిప్తి దిమ్రి అవుట్.. క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పించిన నిర్మాతలు

ఏ హీరోయిన్ కి అయినా కూడా కేవలం ఒక్క సినిమా చాలు ఆమెని ఓ రేంజ్ లో నిలబెట్టడానికి. అప్పటికే చాలా సినిమాలు చేసినప్పటికీ ఆ ఒక్క సినిమాతో కొందరు మంచి స్టార్డంని చూస్తారు. ఇలా ఇటీవల కాలంలో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యిపోయిన హీరోయిన్స్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ అండ్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి కూడా ఒకామె అని చెప్పాలి.

అంతకు ముందు వరకు చాలానే సినిమాలు చేసింది కానీ హిందీలో ఆనిమల్ అనే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యిపోయింది. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్నా అయినప్పటికీ తనకి మించిన ఫేమ్ ని ఈ సినిమాతో త్రిప్తి దిమ్రి అందుకుంది. ఒక్క రోజులోనే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మిలియన్స్ లో పెరిగిపోయారు. దీనితో త్రిప్తి దిమ్రిపేరు బాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ కూడా మంచి హాట్ టాపిక్ గా మారిపోయి ఎన్నో ఆఫర్స్ ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి.

triptii dimri outs from crazy love sequel ashiqui 3 here is why

కాగా ఇంత ఆఫర్స్ లో కూడా ఆమెని ఓ సినిమా మేకర్స్ ఇపుడు పక్కన పెట్టేసినట్టుగా బాలీవుడ్ సినీ వర్గాల్లో షాకింగ్ గా మారింది. త్రిప్తి దిమ్రి తన హాట్ షో కంటే ముందు మంచి పెర్ఫామర్ గా కూడా పలు సినిమాలు చేసింది. కానీ ఆనిమల్ తర్వాతే తనకి మంచి ఫేమ్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకి మళ్ళీ ఇలాంటి హాట్ రోల్స్ మాత్రమే వచ్చాయి కానీ హిందీలో ఒక క్రేజీ సీక్వెల్ లో కూడా మంచి ఆఫర్ తనకి వచ్చింది.

హిందీలో సూపర్ హిట్ అయ్యిన లవ్ డ్రామా సిరీస్ చిత్రాలు "ఆషీకీ" అంటే తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలిసే ఉంటుంది. కాగా ఈ సినిమాలలో మూడో భాగం తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో కూడా ఆమెని తీసుకున్నారు. కానీ మేకర్స్ ఇపుడు ఆమెని తీసేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈమెని తీసేయడానికి వినిపిస్తున్న కారణం కూడా ఒకింత షాకింగ్ గా ఉందని చెప్పాలి.

triptii dimri outs from crazy love sequel ashiqui 3 here is why

మేకర్స్ ఆమెని ఎంచుకున్నప్పటికీ తాము అనుకున్న రేంజ్ లో పెర్ఫామ్ చేయడం లేదని ఆమె ఆ రోల్ కి సూట్ కావడం లేదని ఆమెకి మించి బాగా ఎమోషన్స్ పండించే హీరోయిన్ బాగుంటుంది అని ఆమెని పక్కన పెట్టేశారట. దీనితో కొత్త హీరోయిన్ కోసం మేకర్స్ చూస్తున్నారని తెలుస్తుంది. సో ఇలా ఒక క్రేజీ లవ్ సీక్వెల్ లో త్రిప్తి దిమ్రి మంచి ఛాన్స్ పోగొట్టుకుంది అని చెప్పాలి.

ఇక రీసెంట్ గానే ఈ హాట్ బ్యూటీ అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ బ్యాడ్ న్యూజ్ లో అలాగే ఓ హారర్ థ్రిల్లర్ చిత్రం భూల్ భూలైయా పార్ట్ 3 లో కూడా కనిపించి మెప్పింది. కాగా ఇవి కాకుండా హిందీలోనే మరిన్ని సినిమాల్లో తాను బిజీగా ఉంది. అలాగే ఉంటే బహుశా ఆనిమల్ పార్ట్ 2 లో కూడా తన ప్రెజెన్స్ ఉండొచ్చు, కానీ అది తన చేతుల్లో లేదని ఈ హాట్ బ్యూటీ ఆ మధ్య తెలిపింది.

More from Filmibeat

Read more about: triptii dimri animal bad newz
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X