తెలుగు కమెడియన్ శ్రీనివాస రెడ్డి సరసన త్రిష?
హైదరాబాద్: తెలుగులో వచ్చిన పలు చిత్రాల్లో తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. కమెడియన్లు ఏదో ఒక సందర్భంలో హీరో అవతారం ఎత్తడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అదే దారిలో శ్రీనివాసరెడ్డి కూడా ప్రయాణిస్తున్నాడని, ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందంటూ ఫిల్మ్ నగర్ టాక్.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ వారు ఈచిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ లేక పోయినా....ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త మాత్రం ఇపుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. శ్రీనివాసరెడ్డి సరసన నటించడానికి హీరోయిన్ త్రిష ఓకే చెప్పిందట.
ఇంతకు ముందు హీరోయిన్ అంజలిని హీరోయిన్‌గా చేయమని అడగ్గా.....చేయనని నో చెప్పిందని సమాచారం. అంజలి కంటే పెద్ద హీరోయిన్ అయిన త్రిష, శ్రీనివాసరెడ్డి సరసన చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
మరి హీరోయిన్ త్రిష ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా...ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఇతర విషయాలపై ఇంకా కచ్చితమైన సమాచారం లభించడం లేదు. త్వరలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












