NBK109: బాలయ్యకు హీరోయిన్లు ఫిక్స్.. ఆ సీనియర్ హీరోయిన్ ఓకే.. ఈ కుర్ర బ్యూటీ కూడానా!
టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ హీరోల్లో వరుసగా హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. రెండేళ్ల వ్యవధిలోనే ఆయన 'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి విజయాలతో హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే మరింత వేగంగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. కొద్ది రోజుల పాటు యాక్షన్ పార్టును షూట్ చేసిన తర్వాత విరామం తీసుకున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించి.. చాలా రోజుల క్రితమే కాన్సెప్టు పోస్టర్‌ను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఇందులో కొన్ని ఆయుధాలను చూపించడంతో పాటు సినిమా నేపథ్యంపైన కూడా క్లారిటీ ఇచ్చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై హైప్ క్రమంగా పెరుగుతూనే వస్తోంది. ఇక, ఈ మూవీ 1980 నాటి కథతో రాబోతున్నట్లు కూడా వెల్లడించారు.
హై రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆమె త్వరలోనే షూట్‌లో పాల్గొంటుందని టాక్.

బాలయ్య - బాబీ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు కూడా తాజాగా సమాచారం లీకైంది. ఈమె పాత్ర కూడా మంచి ప్రభావాన్ని చూపించే విధంగా ఉండబోతుందట. మరి త్రిష, మీనాక్షితో బాలయ్య కెమిస్ట్రీ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబినేషన్‌లో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











