తీన్ మార్ ఆనందంలో బికినితో నిషా ఎక్కించనున్న త్రిష
త్రిషపై అభినందనల వర్షం కురుస్తోంది. తన పర్సనల్ ఫ్రెండ్స్, తెలుగు ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్, తమిళ ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ 'తీన్ మార్"లో ఆమె ఫెర్ ఫార్మెన్స్ చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర చేసే అవకాశం రావడం, ఆ క్యారెక్టర్ కి అందరి నుంచి అప్లాజ్ రావడం చాలా సంతోషంగా వుంది అంటోంది త్రిష. 'ఇంతకు మించి నేను ఏమీ కోరుకోవడంలేదు. ఇంతకుముందు ఎన్నో మంచి క్యారెక్టర్స్ చేశాను. కానీ, తీన్ మార్ లో మీరా క్యారెక్టర్ నా జీవితంలో నేనే చేసానన్న విషయం అందరికీ తెలిసిందే. జెస్సీ క్యారెక్టర్ తర్వాత నాకు అంత సంతృప్తినిచ్చింది మీరా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ను జయంత్ గారు నాతో అద్భుతంగా చేయించారు. నేను ఆల్ మోస్ట్ అందరు పెద్ద హీరోలతో చేశాను. పవన్ కళ్యాణ్ తో చెయ్యలేకపోయానే అన్న బాధ ఉండేది. అది 'తీన్ మార్" తో తీరింది అంటూ ఎంతో సంతోషంగా చెప్తోంది త్రిష.
కాగా పవన్ కళ్యాన్ 'తీన్ మార్' సినిమాలో పవన్ తో అధర చుంభనంతో అదరకొట్టిన త్రిష ఆ ఆనందంలో వెంకీతో నటించే సినిమాలో బికినిలో దర్శనమివ్వనుందని సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా 'బాడిగార్డ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బికినిలో నటించేందుకు సురేష్ త్రిషాని ఒప్పించినట్లు తెలుస్తుంది. ఇందుకు పెద్దమొత్తంలోనే పారితోషికం ముట్టచెబుతున్నట్టు సినీ వర్గాల భోగట్టా. రెమ్యూనరేషన్ కోటి రూపాయలు కాకుండా బికినీ కోసం ఎక్స్ ట్రా 25లక్షలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు అనుష్క, ప్రియమణిలు బికినిలో దర్శనమిచ్చారు.


Click it and Unblock the Notifications











