Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రిషా వ్యాపారం!
వెటరన్ హీరోలు మురళీ మోహన్, శోభన్ బాబు తదితరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత హీరోలు ఈ దిశగా పెద్దగా దృష్టి సారించడంలేదు. హీరోయిన్లు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని తపనపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ లిస్ట్ లో స్నేహ ముందంజలో ఉండగా ఇపుడు తాజాగా త్రిషా కూడా చేరింది. ఇంతకుముందే నందనం లాంటి పెద్ద బిల్డింగ్ లను సొంతం చేసుకున్న త్రిషా హైదరాబాద్ లోనూ ఒక ఇల్లు కొనుక్కున్నట్టు సమాచారం. గతవారం చెన్నయ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 50 ఎకరాల ఫామ్ హౌస్ ను కొన్నది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయట. ఇంతటితో త్రిషా ఊరుకోవడం లేదు. అల్వార్ పేట్ సమీపంలోనూ ఒక బిల్డింగ్ ను కొనడానికి సిద్ధపడిందట. 26 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయల విలువగల ఆస్తులను భూముల రూపంలో సొంతం చేసుకోవడానికి మరిన్ని ప్రణాళికలు చేస్తోంది.