బాలయ్యే స్వయంగా రంగంలోకి దిగి ఒప్పించాడా?

By Srikanya

Trisha delighted to work with Balayya
హైదరాబాద్: తన సినిమాకు సంభందించిన విషయాల్లో బాలకృష్ణ ఎప్పుడూ తనవంతు సాయిం చేయటానికి ముందుంటారు. ఆయన తన ప్రక్కన హీరోయిన్ గా చేయటానికి స్వయంగా త్రిషకు ఫోన్ చేసి ఒప్పించారని ఫిల్మ్ నగర్ సమాచారం. త్రిష మొదట రెమ్యునేషన్ విషయంలో పేచి పెట్టిందని, బాలకృష్ణ కలగచేసుకుని ఫైనల్ చేసారని చెప్తున్నారు. త్రిష...ఈ మధ్య కాలంలో తెలుగులో నటించలేదు. అయితే ఈ చిత్రంలో చేస్తున్నానని త్రిష ...ట్విట్టర్ ద్వారా ఖరారు చేసింది. త్రిష ట్వీట్ చేస్తూ... లెజండ్ తో తెర పంచుకుంటున్నందకు చాలా ఆనందంగా ఉంది అన్నదామె.

గతకొంతకాలంగా ఎన్నికల హడావుడిలో ఉన్న నందమూరి బాలకృష్ణ త్వరలో ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.ఈ సినిమాను వచ్చే నెల 2న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారు. రుద్రపాటి రమణారావు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇందులో బాలకృష్ణ సరసన త్రిషను ఎంపిక చేశారు.

''బాలకృష్ణ నుంచి రాబోతున్న మరో పవర్‌ఫుల్‌ చిత్రమిది. దర్శకుడు మంచి కథను సిద్ధం చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి'' అంటున్నారు నిర్మాతలు. తొలుత ఈ పాత్రలో అంజలిని అనుకున్నా తర్వాత నిర్ణయం మారింది. సత్యదేవ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూన్‌ 10న సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X