గ్లామర్,డిమాండు ఉన్న హీరోయిన్లు సినిమాల ద్వారానే కాకుండా రకరకాల సైడు సంపాదనలతో ముందుకెళ్ళటం కామనే. కాని అక్కడ కూడా అత్యాశ చూపెడుతున్నారని అందరూ గగ్గోలు పెడుతున్నారు. తాజాగా త్రిష ఓ బట్టల షాపు ఓపినింగ్ కోసం పది లక్షలు డిమాండు చేసి సంచలనం సృష్టించింది. దాంతో ఆ షాపు ఓనరు ఇంతకు ముందు మిగతా స్టార్స్ కిచ్చిన చెక్కులు లెక్కల చిట్టా విప్పుతున్నాడు. మమతా మోహన్ దాస్ మూడు లక్షలు తీసుకోగా ప్రియమణి, పార్వతీ మిల్టన్, కామ్నా జట్మలానీ, కాజల్ ఒకటిన్నరకే వచ్చారట. అదే అర్చన, మధు శాలిని అయితే యాభై వేలకే ఒప్పుకుంటారట. మహా అయితే ఓ రెండు గంటలు తమ షాపులో గడిపి ఫొటో సెషన్ లో పాల్గొన్నందుకే ఇంత ఇస్తున్నామంటున్నాడు. దాన్ని కూడా దాటి అడగటం పది లక్షలు అడగటం అన్యాయం అంటున్నారు ఆయన. కరక్టే గాని వారి గ్లామర్ ద్వారా పబ్లిసిటీ చేసుకుని ఎదుగుదామనుకునే వాళ్ళ నుండి ఆ మాత్రం వసూలు చేయటంలో తప్పులేదంటున్నారు హీరోయిన్ల పి.ఆర్.ఓ లు మేనేజర్లు . ఈ బిజెనెస్ వ్యవహారం ప్రక్కన పెడితే త్రిష ఈ రేసులో నెంబర్ వన్ గా ఉండి ఎక్కువ రెమ్యునేషన్ వసూలు చేయటం మాత్రం ఆమె డిమాండుని చెప్పకనే చెపుతోంది.