అసిన్ కంటే నేనే ఎక్కువ సెక్సీగా కనిపిస్తాను...
బాలీవుడ్ లో అసిన్ తో పోల్చితే తానే సెక్సీ అంటోంది హీరోయిన్ త్రిష. 'కట్టామీటా" సినిమాతో ప్లాప్ కేక్ తిన్నాగానీ, త్రిషకి బాలీవుడ్ మీద మోజు తీరలేదు. తాజాగా మరోమారు హాట్ హాట్ గా ఫోటోసెషన్ కి ఫోజులిచ్చేసి, బాలీవుడ్ దర్శక నిర్మాతల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోందిట త్రిష. అసిన్, జెనీలియా తదితర హీరోయిన్లతో బాలీవుడ్ లో తనకేమీ పోటీ లేదని త్రిష చెబుతోంటే, త్రిషతో నాకు పోలికా..అంటూ జెనీలియా త్రిషపై మండిపడ్తోంది.
ఇక త్రిష వ్యాఖ్యలపై అసిన్ సైతం తనదైన శైలిలో స్పందించింది. ముందు హిట్ కొట్టి, ఆ తర్వాత మాట్లాడితే బావుంటుందంటూ త్రిషకి ఉచిత సలహా ఇచ్చింది అసిన్. త్రిష మాత్రం ఒక్క హిట్టు కొట్టానంటే, ఇక అసిన్ చెన్నయ్ కి పారిపోవాల్సిందేనంటూ నోరు పారేసుకుంటోంది..
త్రిష అసిన్ కట్టామీటా గజినీ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ trisha asin khatta meetha ghajini aamir khan akshay kumar


Click it and Unblock the Notifications