క్రేజ్ కోసం తిప్పలు: త్రిష ఐటం సాంగ్
బెంగుళూరు: దూకుడు రీమేక్ కలిసిరావడంతో త్రిషకు కన్నడ నాట క్రేజ్ వచ్చింది. అది గమనించిన త్రిష కూడా దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడిందని సమాచారం. కేవలం హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్ లకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని సమాచారం. తాజాగా అత్తారింటికి దారేది కన్నడ రీమేక్‌లో ఐటం సాంగ్ కు త్రిష ను ఖరారు చేసినట్లు తెలిసింది. తెలుగులో ముంతాజ్, హంసా నందిని వేసిన స్టెప్స్ కు కన్నడంలో త్రిష చిందులు వేయనుంది. తెలుగులో లాగ ముగ్గురు కాకుండా కేవలం త్రిష మాత్రమే ఈ స్పెషల్ సాంగ్ లో చేయనుంది.
ఈ చిత్రంలో సుదీప్ (ఈగ ఫేమ్) హీరోగా నటిస్తున్నారు. తెలుగులో నదియా చేసిన పాత్రను కన్నడంలో మధుబాల చేస్తోంది. ఇదేకాక ఇంకా మరికొన్ని భారీ చిత్రాల్లో ఆమె పేరును కన్నడ దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. కన్నడంలో ఒక్కసారిగా వచ్చిన పేరుప్రతిష్టల్ని కాపాడుకునేందుకు కథాంశాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకుందట త్రిష. ప్రస్తుతం త్రిష బాలకృష్ణ సరసన సత్యదేవా చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

అత్తారిందికి దారేది రీమేక్ విషయానికి వస్తే...
ఈ చిత్రం టైటిల్ ని రానా గా ఫైనలైజ్ చేసి, సుదీప్ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ రైట్స్ చంద్రశేఖర్ అనే నిర్మాత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 'నిమిషాంబ ఫిల్మ్స్' పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగులో ఈచిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. కన్నడ వెర్షన్ కు గానూ నంద కిషోర్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హరిప్రియ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ప్రణిత పోషించిన పాత్రలో కనిపించనుంది. సమంత పాత్రలో కన్నడ హీరోయిన్ రచిత రామ్ నటిస్తుంది.
కన్నడ సీమలో మాత్రం సుదీప్ సూపర్‌స్టార్. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేసి అక్కడ విజయాలు అందుకోవడంలో కూడా సుదీప్ దిట్ట. ప్రభాస్ ‘మిర్చి' సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా ‘మాణిక్య' పేరుతో రీమేకై అక్కడ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ విజయం తాలూకు ఆనందంలో తేలియాడుతున్నారు.


Click it and Unblock the Notifications











