త్రిష తక్కువేం కాదు..బికినీ వేసింది
హైదరాబాద్ : మొన్న రిలీజైన సికిందర్ చిత్రంలో సమంత బికినీలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్ తేడాగా ఉన్నా ఆమె బికినీ టాక్ మాత్రం వైరల్ లాగ అంతర్జాలంలో హల్ చల్ చేసి సినిమాకు ఉన్నంతలో క్రేజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు త్రిష తో బికిని వేయించటం ద్వారా తమ ప్రాజెక్టుకు క్రేజ్ తేవాలని పవర్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దూకుడు రీమేక్ గా రూపొందుతున్న పవర్ చిత్రం ఇప్పుడు కన్నడంలో పవర్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో త్రిష బికినీ వేసినట్లు కన్నడ పరిశ్రమలో వినిపిస్తోంది. నిజమా కాదా అన్నది తేలాలంటే ఈ నెల 28 (రిలీజ్ ) దాక వేచి ఉండాల్సిందే.
మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడు. ఈ చిత్రం మహేష్...దూకుడు కి రీమేక్. 14 రీల్స్ వారే కన్నడంలోనూ నిర్మిస్తున్నారు. మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్, త్రిష నటించారు. రీసెంట్ గా ఆడియో పంక్షన్ నిర్వహించి, ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ రావటంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు.

అలాగే 'పవర్' ఆడియో కార్యక్రమానికి మహేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ ఆడియో వేడుకకి మహేష్ బాబు కోసం భారీగా అభిమానులు తరలి వచ్చారు. బళ్లారిలో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండడం వల్ల చాలా మంది మహేష్ బాబు కోసం ఈ ఆడియో వేడుకకి వచ్చారు. దాంతో ఆ విథంగా కూడా చిత్రానికి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











