విజయ్‌తో త్రిష బర్త్ డే సెలబ్రేషన్.. దళపతితో అలా క్లోజ్‌గా.. పర్సనల్ ఫోటోను షేర్ చేసిన బ్యూటీ!
కోలీవుడ్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉన్నారు. ఓసారి పీటల మీద వరకు పెళ్లి ఆగిపోవడంతో నాటి నుంచి మూడు ముళ్ల సంగతిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే త్రిష వ్యవహారం గత కొన్నాళ్ల నుంచి అనేక అనుమానాలకు తావిస్తోంది. పెళ్లై, పిల్లలున్న స్టార్ హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఫోటో మరోసారి వివాదాస్పదమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
పాతికేళ్లుగా స్టార్ హీరోయిన్‌గా
దాదాపు పాతికేళ్లుగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు త్రిష. ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తున్నారు, వెళ్తున్నారు కానీ ఈమె మాత్రం ఇంకా నెంబర్‌వన్‌గానే కొనసాగుతున్నారు. ప్రస్తుత తరంలో ఇంత సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం మామూలు విషయం కాదు.. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు త్రిష. ఇప్పటికే థగ్‌లైఫ్‌తో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం విశ్వంభర సహా మరికొన్ని సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. థగ్‌లైఫ్ డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ త్రిష అందాలకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. 43 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు.

త్రిష నిశ్చితార్ధం రద్దు
శింబు నుంచి ధనుష్ వరకు పలువురితో త్రిష ప్రేమాయాణాలు సాగించిందని కోలీవుడ్‌లో కథలు కథలుగా చెబుతారు. త్రిషకు వరుణ్ అనే ఓ వ్యాపారవేత్తతో 2015 జనవరి 23న నిశ్చితార్ధం జరిగింది. రేపో మాపో పెళ్లి చేసుకోబుతున్నారనగా ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది. త్రిష - వరుణ్‌ల పెళ్లి ఆగిపోవడానికి కారణాలు ఇవేనంటూ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. దీని నుంచి కోలుకున్న త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా ఆశ్చర్యకరంగా వరుస హిట్లు కొడుతున్నారు. ఇదే సమయంలో పెళ్లై, పిల్లలున్న ఓ స్టార్ హీరోతో త్రిష ఎఫైర్ నడుపుతున్నారంటూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. ఇళయ దళపతి విజయ్.
త్రిషతో విజయ్ సీక్రెట్ వెకేషన్
తమిళనాట హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు త్రిష కృష్ణన్, దళపతి విజయ్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే త్రిష, విజయ్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. సీక్రెట్‌గా ఎయిర్‌పోర్టుల్లో కనిపించడంతో పాటు ఫారిన్ ట్రిప్పులు, వెకేషన్‌లతో మీడియాకు చాలా పని పెడుతున్నారు వీరిద్దరూ. విజయ్‌కి పాతికేళ్ల కిందటే సంగీతతో వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా విజయ్‌కి, సంగీతకి మధ్య విభేదాలు నడుస్తున్నాయని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
విజయ్‌కి బర్త్ డే విషెస్
ఈ క్రమంలోనే త్రిషతో విజయ్ ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు, వీడియోలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఒకే సోఫాలో త్రిష- విజయ్ చాలా క్లోజ్‌గా కూర్చొని ఉండగా.. త్రిష పెంపుడు కుక్క పిల్లను విజయ్ ఆడిస్తున్నారు. ఈ సమయంలో త్రిష అతనిని కొరుక్కు తినేలా చూస్తున్నారు. ఈ ఫోటోని షేర్ చేసిన ముద్దుగుమ్మ.. హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇది కాస్తా తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, విజయ్, త్రిషల అభిమానులు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











