Trisha - Vijay: విజయ్‌తో త్రిషా కృష్ణన్ బ్రేకప్? దళపతితో బంధానికి అలా ఫుల్‌స్టాప్?

గత కొంతకాలంగా తమిళ సినీ, రాజకీయ రంగాలు దళపతి విజయ్, త్రిషా కృష్ణన్ చుట్టూరే తిరుగుతున్నాయి. ద్రవిడ రాజకీయా దిగ్గజాలను మట్టికరిపించి టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు విజయ్. పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఆయన స్నేహితురాలు, సినీనటి త్రిషతో ఆయన బంధం గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా వీరిద్దరి రిలేషన్‌కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

త్రిషకు విజయ్‌కి ఉన్న బంధంపై కోలీవుడ్‌లో ఎప్పటి నుంచో రకరకాల గాసిప్స్ వచ్చాయి. అయితే తమిళనాడు ఎన్నికల సమయానికి ఇవి పీక్స్‌కు చేరాయి. ఎన్నికల నోటిఫికేషన్ పడిన వెంటనే తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకు తోడు.. విజయ్ సతీమణి సంగీత విడాకుల పిటిషన్‌లో చేసిన ఆరోపణలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయినప్పటికీ విజయ్ కానీ, త్రిష కానీ వీటిపై ఎప్పుడూ స్పందించలేదు. విజయ్‌ని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు ప్రత్యర్ధులు. తన వ్యక్తిగత జీవితం సంగతి నేను చూసుకుంటాను, మీరు ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టాలని విజయ్ తన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

Trisha Krishnan do not wish CM Vijay on his birthday Here is why

ఈ పుకార్ల మధ్యలోనే ఓ నిర్మాత ఇంట్లో వివాహ వేడుకకు త్రిష - విజయ్ జంటగా వెళ్లడం అనేక అనుమానాలకు తావించ్చింది. విజయ్‌తో తన బంధంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, తనపై దారుణంగా ట్రోలింగ్ జరిగినా ప్రతిక్షణం విజయ్‌కి అండగా నిలిచారు త్రిష. ఎన్నికల్లో టీవీకేకు ఓటు వేశానని పరోక్ష సంకేతాలు ఇచ్చిన ఆమె.. కౌంటింగ్ రోజు ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకుని నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ త్రిష సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇటీవల అజిత్ తల్లి కన్నుమూయడంతో విజయ్- త్రిష కలిసి అజిత్ ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు.

ఈ పరిణామాలతో విజయ్- త్రిష త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక తిరుచ్చి ఈస్ట్‌లో జరగబోయే ఉప ఎన్నికలో త్రిష పోటీ చేసి టీవీకే ప్రభుత్వంలో కీలక పదవిని అందుకుంటారని కూడా తమిళ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. కానీ సీఎం విజయ్ పుట్టినరోజు ఈ ఊహాగానాలకు, గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు తెరదించింది. విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. కానీ త్రిష వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చాలాకాలంగా విజయ్‌కి ప్రతి పుట్టినరోజు నాడు ఖచ్చితంగా శుభాకాంక్షలు చేస్తూ వస్తున్న ఆమె.. ఈసారి మౌనంగా ఉండిపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతేకాదు.. ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌ని త్రిష అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది.

త్రిష ఇలా సైలెంట్ కావడం వెనుక కోలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. విజయ్ తన కుటుంబానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారట. విజయ్‌తో భార్య సంగీత, పిల్లలను తిరిగి కలపడానికి ముఖ్యమంత్రి తల్లీదండ్రులు, సన్నిహితులు కృషి చేస్తున్నారట. విజయ్ విడాకుల విషయంలో వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాని వల్లే విజయ్‌కు త్రిష దూరంగా ఉండాలని భావిస్తున్నారని, అందుకే బర్త్ డేకు విషెస్ కూడా చెప్పలేదని అంటున్నారు. విజయ్- త్రిషల బంధం ఇక ముగిసినట్లేనని, విజయ్‌తో బ్రేకప్ జరిగినట్లు త్రిష ఇన్‌డైరెక్ట్‌గా ఇలా హింట్ ఇచ్చారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి నిజంగానే త్రిష- విజయ్ విడిపోయారా? త్రిషా కృష్ణన్‌లో అకస్మాత్తుగా వచ్చిన మార్పుకు కారణం ఏంటీ? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X