Trisha engagement! త్రిషా ఎంగేజ్‌మెంట్? విశ్వంభర హీరోయిన్ ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్ ట్రెండింగ్

ఇపుడు ఉన్న హీరోయిన్స్ ఏమో కానీ ఒకప్పుడు తెలుగు సహా తమిళ సినిమాని ఒక ఊపు ఊపిన హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువమంది ఉన్నారు అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి జెనరేషన్ లో చూసుకున్నా అలానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు జెనరేషన్ లో చూసుకున్నా ఈ రెండు జెనరేషన్స్ ని కలిపి సినిమాలు చేసిన హీరోయిన్స్ కొందరు ఉన్నారు.

కాగా ఈ హీరోయిన్స్ లో ఒకప్పుడు టాప్ బ్యూటీ త్రిష కృష్ణన్ కూడా ఒకరు. మరి త్రిష ఎప్పుడో 2000 సంవత్సరం నుంచే సినిమాల్లో రాణించిన త్రిష అక్కడ నుంచి దాదాపు పదిహేనేళ్ళు పాటుగా అలా స్టార్ హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో కొనసాగింది. అయితే ఇన్నేళ్లు గడిచినా కూడా త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలుసు. ఇపుడు త్రిష వయస్సు అక్షరాలా 41..

Trisha Krishnan engagement

అవును 41 ఏళ్ల త్రిష మన సౌత్ లో పెళ్లి కాకుండా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్స్ లో టాప్ లో ఉంటుంది. కాగా తనపై పలు పుకార్లు మాత్రం లేకపోలేవు. ఓ ప్రముఖ స్టార్ హీరో అది కూడా పెళ్ళైన స్టార్ హీరోతో తాను రిలేషన్ లో ఉన్నట్టుగా పలు ఊహాగానాలు తమిళ సినీ వర్గాల్లో ఉన్నాయి. కాగా ఈ నేపథ్యంలో త్రిష చేసిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.

తనకి ఎవరో మల్లె పూలు పెడుతున్నట్టుగా ఉంది. ఇది సరిగా చూస్తే ఎవరో మగవారి చేతిలానే కనిపిస్తుంది. సరే అది ఎవరో మగవాళ్ళు పెట్టడం లేదు అనుకున్నా ఆ పోస్ట్ కి త్రిష క్యాప్షన్ మరింత ఆసక్తి రేకెత్తించింది. కాగా ఇందులో "ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది" అంటూ చేసిన పోస్ట్ ఇపుడు చర్చకి దారి తీసింది. ఫోటో ఏమో చూస్తుంటే ఏదో పెళ్ళికి రెడీ అయినట్టుగా ఉంది క్యాప్షన్ ఏమో ఎంతో ప్రేమగా ఉంది.

వీటితో త్రిష గాని ఎంగేజ్మెంట్ చేసుకుందా అనే అనుమానాలు కూడా ఇపుడు మొదలయ్యాయి. మరి ఇది త్రిష ఏ కోణంలో పెట్టారో కానీ ఇది మాత్రం మంచి చర్చకి దారి తీసింది. మరి త్రిష నుంచి ఈ క్రిప్టిక్ పోస్ట్ పై ఏమన్నా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. ఇక రీసెంట్ గానే త్రిష నటించిన పట్టుదల సినిమా హీరో అజిత్ తో నటించింది రిలీజ్ కి వచ్చింది.

ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర అనే భారీ చిత్రంలో నటిస్తుంది. అంతే కాకుండా ఒక్క ఈ రెండు భాషలు సహా ఇతర దక్షిణాది భాషల్లో కూడా త్రిష ఫుల్ బిజీగా ఉండడం విశేషం. మళ్ళీ చాలా కాలం తర్వాత త్రిష ఈ రేంజ్ లో బిజీగా ఉండి లైఫ్ ని లీడ్ చేస్తుంది. మరి ఈ ఏజ్ లో తన నుంచి ఏమన్నా గుడ్ న్యూస్ వస్తుందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.

More from Filmibeat

Read more about: trisha chiranjeevi vishwambhara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X