Chiru 156: ఎట్టకేలకు ఫిక్సైన చిరంజీవి హీరోయిన్.. అనుష్క, ఐశ్వర్యరాయ్‌ను కాదని ఆమెనే!
టాలీవుడ్‌లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న బడా హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన జెట్ స్పీడుతో వెళ్తోన్నారు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలను ఆడియెన్స్‌కు అందించి అలరించారు. ఈ క్రమంలోనే ఇటీవలే చిరంజీవి 'భోళా శంకర్' మూవీతో వచ్చారు. ఈ చిత్రం మాత్రం భారీ నష్టాలతో డిజాస్టర్ అయింది.
గత చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. అందుకోసమే ఆయన ఇప్పుడు 'బింబిసార'తో సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్టతో తన 156వ సినిమాను చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో విభిన్నమైన కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్‌ను కూడా వారం రోజుల పాటు జరిపి విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన షూట్‌కు సంబంధించిన ప్లాన్‌ను కూడా రెడీ చేసుకుంటున్నారు.
క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీలో చిరంజీవి సరసన ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకరు మెయిన్ హీరోయిన్ కాగా.. మిగిలిన వాళ్లు కీలక పాత్రలు చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇందులో మెయిన్ లీడ్ కోసం అనుష్క శెట్టి, నయనతార, ఐశ్వర్యరాయ్ సహా ఎంతో మంది పేర్లు వినిపించాయి.

చిరంజీవి సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి తాజాగా క్లారిటీ వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కోసం త్రిషను చిత్ర యూనిట్ కన్ఫార్మ్ చేసిందట. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. అంతేకాదు, ఈ స్టార్ హీరోయిన్ వచ్చే షెడ్యూల్ నుంచే షూటింగ్‌లో కూడా పాల్గొనబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబోలో వస్తున్న ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో దగ్గుబాటి రానా విలన్‌గా చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందించబోతున్నారు.


Click it and Unblock the Notifications











