సీనియర్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్.. వీళ్లను కలిపింది ఏ డైరెక్టరో తెలిస్తే!
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ఈ మధ్య కాలంలో రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. వరుసగా 'సలార్: సీజ్‌ఫైర్', 'కల్కి 2898 ఏడీ' వంటి వరుస హిట్లను అందుకున్నాడు.
రెండు వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే మొదలు పెట్టేసిన 'సలార్ 2', 'రాజా సాబ్' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమాను ప్రకటించాడు. ఇది భారీ స్థాయిలో రాబోతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందనున్న 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా రోజులే అవుతోంది. కానీ, వీళ్లిద్దరూ వేరే వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు. అయినప్పటికీ ఈ చిత్రంపై అంచనాలు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'స్పిరిట్' మూవీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టినట్లు తెలిపాడు. ఇక, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

ప్రభాస్ హీరోగా చేస్తోన్న 'స్పిరిట్' సినిమాలో త్రిషను తీసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా ఆమెకు చెప్పినట్లు సమాచారం. ఇది బాగా నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. త్వరలోనే త్రిషపై ప్రకటన చేయబోతున్నారని టాక్. గతంలో ప్రభాస్‌తో ఆమె 'వర్షం', 'పౌర్ణమి', 'బుజ్జిగాడు' వంటి సినిమాల్లో నటించింది.
ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు కూడా తెలిసింది. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











