విశ్వంభరలో త్రిషకు రికార్డు రెమ్యూనరేషన్.. చిరంజీవికి ఎన్ని కోట్లు ఇస్తున్నారంటే!
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లకు ఆదర్శంగా నిలిచిన ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా చిత్ర రంగంలో తనదైన మార్కును చూపిస్తోన్న ఆయన.. ఆరు పదుల వయసు దాటినా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. ఇలా ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు.
'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో తనలోని సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న మూవీనే 'విశ్వంభర'. ముల్లోకాలు అనే కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. మొదటి షెడ్యూల్‌నే యాక్షన్ షూట్‌తో మొదలెట్టి.. ఆ తర్వాత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన నటీనటులపై ముఖ్యమైన సీన్స్‌ను షూట్ చేస్తున్నారు.
విజువల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' మూవీలో హీరోయిన్‌గా సీనియర్ హీరోయిన్ త్రిషను నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంటోంది. అంతేకాదు, ఇందులో ఆమె డుయల్ రోల్ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కోసం త్రిష తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ గురించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'విశ్వంభర' సినిమా కోసం త్రిష ఏకంగా రూ. 12 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుంటుందట. ఇది తెలుగులో అత్యధిక మొత్తం అని అంటున్నారు. గతంలో ఏ హీరోయిన్ కూడా ఇంత తీసుకోలేదన్న మాట. ఇక, ఈ చిత్రం కోసం చిరంజీవి ఏకంగా రూ. 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రలను చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











