For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దానికి సీక్వెల్‌గా మహేశ్ - త్రివిక్రమ్ మూవీ: ఆ హీరోయిన్ వల్ల లీకైన న్యూస్.. అరాచకమైన కథతో!

  |

  సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో యమ ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఏకంగా హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను ప్రకటించాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

   మహేశ్ బాబు అలా... గురూజీ ఇలా

  మహేశ్ బాబు అలా... గురూజీ ఇలా

  ‘భరత్ అనే నేను', ‘మహర్షి', ‘సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస హిట్లతో దూసుకెళ్తోన్న మహేశ్ బాబు.. ప్రస్తుతం పరశురాంతో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది ‘అల.. వైకుంఠపురములో' సినిమా ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. కానీ, ఇప్పటి వరకూ మరో సినిమా మొదలెట్టలేదు.

  ప్రముఖ హీరోయిన్‌కు రోడ్డు ప్రమాదం: తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు.. ఘటనలో తెలుగమ్మాయి మృతి

   అనుకోకుండా సెట్టైన సూపర్ కాంబో

  అనుకోకుండా సెట్టైన సూపర్ కాంబో

  ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్ తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఇది కొద్ది రోజుల్లో పట్టాలెక్కుతుందనగా ఆగిపోయినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తారక్.. కొరటాల శివతో సినిమాను ప్రకటించాడు. అలాగే, గురూజీ మహేశ్ బాబును లైన్‌లో పెట్టుకున్నాడు.

  ప్రకటన వచ్చింది... పని మొదలైంది

  ప్రకటన వచ్చింది... పని మొదలైంది

  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే ప్రకటించాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ వీడియోను సైతం విడుదల చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రకటించిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించాడు త్రివిక్రమ్.

   ప్రాజెక్టుపై పుకార్లు.. అలాంటి మూవీ

  ప్రాజెక్టుపై పుకార్లు.. అలాంటి మూవీ

  మహేశ్ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టుకు ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచి దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా కథ ఇదే అంటూ కొన్ని లైన్స్ తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇది ఫుల్ కమర్షియల్ మాస్ మూవీ అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  Mahesh Babu Biography, Life Style, Cars And Net Worth | Mahesh Babu Filmography | Filmibeat Telugu
   సినిమాలో ఆ హీరోయిన్ కీలక పాత్ర

  సినిమాలో ఆ హీరోయిన్ కీలక పాత్ర

  మహేశ్.. త్రివిక్రమ్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష కీలక పాత్రను పోషిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఆమె కనిపించేది చాలా తక్కువ సమయమే అయినా.. దాని ప్రభావం మాత్రం సినిమా మొత్తం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే దీనికి త్రిష గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని తెలుస్తోంది.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన అనుష్క శర్మ: విరాట్ కోహ్లీ భార్యను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

   దానికి సీక్వెల్ కావడం వల్లే ఆమెతో

  దానికి సీక్వెల్ కావడం వల్లే ఆమెతో

  ఈ సినిమాలో త్రిష నటిస్తుందన్న వార్త బయటకు రాగానే.. ఇది మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు'కు సీక్వెల్‌ అని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, మహేశ్, త్రిషకు పుట్టిన కొడుకు కథగా ఈ మూవీ తెరకెక్కబోతుందని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందుకే ఈ సినిమాకు ‘అతడే పార్థు' అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిలిం నగర్ ఏరియాలో చర్చ జరుగుతోంది.

  English summary
  Mahesh Babu recently Announced his 28 film with Trivikram Srinivas. Senior Heroine Trisha Krishnan to plat Key Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X