ఎట్టకేలకు ఫిక్సైన త్రిష పెళ్లి: ఆ నిర్మాతతోనే లవ్ మ్యారేజ్.. ఎప్పుడో తెలుసా?
అందానికి అందం, నటనకు నటనతో సుదీర్ఘ కాలంగా సౌత్ ఇండియా మొత్తంలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ త్రిష. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. అన్ని భాషల్లోనూ రాణించింది.
అదే సమయంలో వరుస ఆఫర్లతో సత్తా చాటింది. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఈ హీరోయిన్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం పలు ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొంది. ఇక, ఈ మధ్య కాలంలో తరచూ త్రిష పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కాబోయే భర్త వివరాలు లీకయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

టీనేజ్‌లోనే మొదలెట్టిన త్రిష: త్రిష టీనేజ్‌లోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. తండ్రి లేకున్నా తల్లి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఈ భామ.. గ్లామర్ ఫీల్డులో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని సత్తా చాటింది. ఫలితంగా అప్పుడే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుని ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది.

హీరోయిన్.. ఫుల్ పాపులారిటీ: త్రిష 'జోడీ' అనే సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన 'మౌనం పెసియాదే'లో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. 'వర్షం'తో మొదటి బ్రేక్‌ను అందుకుంది. అప్పుడే టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. అలా హవాను చూపిస్తూనే ఉంది.

అతడితో లవ్.. నిశ్చితార్థంతో: ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైంది. వీళ్లిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో వరుణ్.. త్రిషను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇది జరిగిన కొంత కాలానికి త్రిష కెరీర్‌ను కంటిన్యూ చేసేసింది.
ఇప్పుడా సినిమాలు చేస్తోంది: సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్లు అవుతన్నా త్రిష రేంజ్ మాత్రం తగ్గనే లేదు. ఈ మధ్య కాలంలో ఆమె మరింత వేగంగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్‌తో 'లియో' చేసింది. అలాగే, 'ది రోడ్', 'విడా ముయార్చి', 'సత్తురంగా వెట్టై 2' వంటి తమిళ చిత్రాలు చేస్తోంది. అంతేకాదు, 'రామ్ పార్ట్ 1', 'ఐడెంటిటీ' అనే మలయాళ మూవీల్లోనూ నటిస్తోంది.

హాట్ టాపిక్‌గా త్రిష మ్యారేజ్: తన ఏజ్ హీరోయిన్లంతా పెళ్లిళ్లు చేసుకున్నా.. త్రిష మాత్రం ఇంకా మూడు ముళ్లు వేయించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పలు ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి ఆమె ఎన్నో కామెంట్లు చేసింది. దీంతో ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తరచూ ఆమె వివాహం గురించి ఏదో ఒక న్యూస్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతూనే ఉంటోంది.

ఆ నిర్మాతతోనే త్రిషకు పెళ్లి: త్రిష పెళ్లి గురించి తాజాగా ఓ న్యూస్ సౌత్ ఇండియన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ బ్యూటీ త్వరలోనే మలయాళ పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతను పెళ్లాడబోతుందట. వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల క్రితం ఓ సినిమా చేస్తోన్న సమయంలో ప్రేమ చిగురించిందని అంటున్నారు. అంతేకాదు, త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాని టాక్.


Click it and Unblock the Notifications











