త్రిషతో పెళ్లికి విజయ్ ఫ్యామిలీ ఓకేనా? ప్రమాణ స్వీకారంలో దళపతి తల్లి షాకింగ్ రియాక్షన్

వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించిన తమిళ పొలిటికల్ డ్రామాకు ఆదివారంతో తెరపడింది. అనేక మలుపులు, వివాదాల నడుమ టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్.. తమిళనాడుకు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విజయ్ అభిమానులు పోటెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో త్రిష సందడి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాదు.. త్రిష- విజయ్ రిలేషన్‌పై గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.

త్రిషతో విజయ్ రిలేషన్‌లో ఉన్నారంటూ కోలీవుడ్ మీడియా ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. త్రిష ఇంటి విజయ్ బయటికొస్తేనే రాజకీయాలు అంటే ఏంటో తెలుస్తాయని, జీరో నాలెడ్జ్‌తో ప్రజలకు విజయ్ ఏం చేస్తారు? ముందు తన ఇంట్లో సమస్యలను పరిష్కరించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో త్రిషకు నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు.

Trisha Krishnan Meets TVK Vijay s Parents at Swearing-In Event Viral Moments Spark Marriage Buzz

ఈ వెంటనే దళపతి విజయ్ సతీమణి సంగీత విడాకుల కేసు మరింత కలకలం రేపింది. తమిళ సినీ రంగానికి చెందిన ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని ఆమె ఆరోపించడంతో అందరి వేళ్లూ త్రిష వైపే వెళ్లాయి. ఆ తర్వాతి రోజే విజయ్- త్రిష జంటగా ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావడం ఈ పుకార్లకు మరింత బలం తీసుకొచ్చింది. ఇంత జరుగుతున్నా త్రిష కానీ, విజయ్ కానీ తమ బంధాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. ఈ లోపు తమిళనాడు ఎన్నికల ప్రచారం విజయ్ బిజీ అయ్యారు. అటు త్రిష కూడా తన సినిమా షూటింగ్స్ చూసుకున్నారు.

తమిళనాడు ఎన్నికల రోజున ఓటు హక్కును వినియోగించుకున్న త్రిష.. ఇంటికి వెళ్లి విజయ్‌తో తను నటించిన గిల్లీ మూవీలోని విజిల్ సాంగ్‌ను పోస్ట్ చేసి తాను ఓటు ఎవరికి వేసింది పరోక్షంగా చెప్పింది. కౌంటింగ్ రోజున తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని త్రిష దర్శించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ ఎన్నికల్లో గెలవాలనే త్రిష తిరుమలకు వెళ్లారంటూ గుసగుసలు వినిపించాయి. తిరుమల నుంచి నేరుగా విజయ్ నివాసానికి చేరుకున్న త్రిష.. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తన స్నేహితుడిని అభినందించడం వార్తగా మారింది.

ఈ పరిణామాలతో విజయ్ త్వరలోనే త్రిషను రెండో పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కోర్టులో తన విడాకుల కేసు నడుస్తుండటంతో సంగీతకు విడాకులిచ్చి, ఆమెతో సెటిల్ చేసుకుంటారని చర్చ నడుస్తోంది. 35 కోట్ల రూపాయలను భరణం కింద చెల్లించి.. పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని విజయ్ తన లాయర్ల ద్వారా సంగీత ముందు ప్రస్తావించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్ని సెట్ అయితే సంగీతతో విడాకుల వ్యవహారం ఓ కొలిక్కివచ్చి.. ఆ తర్వాత త్రిషను విజయ్ పెళ్లాడతారని కోలీవుడ్‌లో చెవులు కోరుకుంటున్నారు.

అయితే ఇంత జరుగుతున్నా త్రిష- విజయ్‌ల బంధంపై విజయ్ కుటుంబ సభ్యులు.. ప్రత్యేకించి ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి శోభ చంద్రశేఖర్ స్పందించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన త్రిష సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అందరిచూపు ఆమెపైనే పడింది. అతిథులను పేరు పేరునా పలకరిస్తూ ఉత్సాహంగా గడిపారు. ఆ సమయంలో ముందు వరుసలో కూర్చొన్న విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభ దగ్గరికి త్రిష వెళ్లారు. త్రిషను చూడగానే శోభ కుర్చీలోంచి లేచి ఆమెను నవ్వుతూ పలకరించి, ముద్దాడటం కలకలం రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో త్రిషతో విజయ్ పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: trisha krishnan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X